హైదరాబాద్

స్పెషల్ ‘డే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: నేటి శుక్రవారం ఓ స్పెషల్ డేగా చెప్పుకోవచ్చు. మహానగరంలో ఇప్పటికే అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారానికి తొమ్మిదో రోజుకు చేరుకుంటాయి. ఇప్పటి వరకు మూడు, ఐదు, ఏడు రోజుల్లో సుమారు 3వేల విగ్రహాలు నిమజ్జనం కాగా, ఇందుకు రెండింతలు శుక్రవారం నిమజ్జనమయ్యే అవకాశముంది. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై మరింత సందడి నెలకొనే అవకాశముంది. శుక్రవారం రోజునే ముస్లింలోని ఒక వర్గం ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మొహర్రం కూడా శుక్రవారమే వచ్చింది. వీటన్నింటికి మించి శుక్రవారం పాతబస్తీలోని చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో ముస్లిం సామూహిక ప్రార్థనలు, పక్కనే చార్మినార్‌లో కొలువుదీరిన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి దర్శనం కోసం అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు చేపట్టారు. మధ్యాహ్నాం ఒంటి గంటకు జరిగే సామూహిక ప్రార్థనలకు గంట ముందే అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఈ మసీదుకు చేరుకుంటారు. అప్పటికే భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టి ఉండటం, ప్రార్థనలు ముగిసిన తర్వాత భక్తులు ప్రశాంతంగా వెళ్లిపోయేందుకు వీలుగా కంచెలను ఏర్పాటు చేసి, సాయుధ బలగాలతో బందోబస్తును చేపట్టారు. మొహరం పండుగ సందర్భంగా శుక్రవారం డబీర్‌పురాలోని ప్రధాన అశూర్‌ఖానా నుంచి ప్రారంభమయ్యే మొహర్రం ఊరేగింపు కొనసాగే ప్రాంతాల్లో ఇరువైపులా వచ్చే గణేష్ మండపాల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లోని గణేష్ మండపాల వద్ద ఇప్పటికే సాయుధ బలగాలను మోహరించారు. శ్రీ్భగ్యలక్ష్మి దేవాలయం వద్ద కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఓ పద్దతి ప్రకారం తిరిగి వెళ్లేందుకు వీలుగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనం కోసం శుక్రవారం ట్యాంక్‌బండ్‌కు మరింత ఎక్కువ సంఖ్యలో జనం వచ్చే అవకాశముండటంతో బందోబస్తును మరింత పటిష్టం చేశారు. సికిందరాబాద్ బాటా, జనరల్‌బార్, గాన్స్‌మండీలతో పాటు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు శుక్రవారం మొహర్రం సెలవుకావటంతో అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశముండటంతో ఆయా గణేష్ మండపాల వద్ద పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శుక్రవారం ఇరువర్గాలకు చెందిన ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగానే జరుపుకున్నా, శాంతిభద్రతల పరిరక్షణకు బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీసులకు ఉరుకులు, పరుగులు మాత్రం తప్పేలాలేవు.