హైదరాబాద్

మరో తాగునీటి ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: మరిన్ని శివారు ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు జలమండలి రూ. 4500 కోట్లతో మరో సరికొత్త ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాల్లో శరవేగంగా మిషన్ భగీరథ పనులు కోనసాగుతున్నాయి. ఇప్పటికే 60 గ్రామాలకు సమృద్ధిగా నీరు అందిస్తున్న జలమండలి రూ.756 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్ట్ పనులను నవంబర్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఔటర్ రింగ్‌రోడ్డులోపలి గ్రామ ప్రజల మంచినీటి కష్టాలు తీరనున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 191 గ్రామ పంచాయితీలు, ఏడు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో సమృద్ధిగా తాగునీరు అందించనున్నారు. అర్బన్ మిషన్ భగీరధలో భాగంగా జలమండలి రూ.756 కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్ చేపట్టింది. దాదాపు 184 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు గాను జలమండలి 172 రిజర్వయర్లను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు 60 గ్రామాల్లో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి మూడు లక్షల మందికి నీటి సరఫరా చేస్తోంది. సమృద్ధిగా ఈ గ్రామాలనకు నీరు అందిస్తు నూతనంగా ఆపరేషన్, మెయింటనెన్స్ విభాగానికి సంబందించి నూతనంగా 18, 19, 20 డివిజన్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. జలమండలి ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలకు చేస్తున్న తాగునీటి ప్రాజెక్ట్ రిజర్వాయర్లు, నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, మంచినీటి పైప్‌లైన్ విస్తరణ పనులకు సంబంధించిన ‘్ఫటోప్రదర్శన’ను బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ ప్రారంభించినానంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్ట్‌లో భాగంగా 62 రిజర్వాయర్ల నిర్మాణం, 612 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ విస్తరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. 11 నెలల ముందే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. వర్షాకాలంలో ఇబ్బంది తలెత్తడంతో ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు.

పెరగనున్న లక్షన్నర కనెక్షన్లు.. డివిజన్లు
ఓఆర్‌ఆర్‌లో లోపలి గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టుతో సుమారు లక్షన్నర వరకు కొత్త నల్లా కనెక్షన్లు అందుబాటులోకి వస్తాయని ఎండీ దాన కిషోర్ తెలిపారు. జలమండలి విస్త్రృత పరిధి పెరిగిందని, అందుకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించేందుకు నూతన డివిజన్‌లు నెలకొల్పి 21 మంది ఇంజనీర్లు, 200 మది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా రింగ్‌మెయిన్ పనులను రూ.350 కోట్లతో చేపడుతున్నామరి తెలిపారు. వీటిలో 1800 ఎంఎం డయా పైప్‌లైన్‌లను దాదాపు 40 కిలోమీటర్లు వేశామని అన్నారు. రైల్వే క్రాసింగ్, హైవేల క్రాసింగ్‌లతో పాటు మరికోన్ని ప్రాంతాల్లో భూవివాదాల కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని దానకిషోర్ తెలిపారు. మంచినీటి వ్యవస్థను మరింత మెరుగు పర్చేందుకు రింగ్ మెయిన్-2 ప్రాజెక్ట్‌ను రూ.4550 కోట్లతో చేపట్టేందుకు డీపీఆర్‌లను సిద్ధం చేసి అమోదం కోసం ప్రభుత్వానికి పంపించామని వివరించారు.
రింగ్‌మెయిన్-2 అందుబాటులోకి వస్తే నీటి లభ్యతను బట్టి కృష్ణా, గోదావరి, మంజీరా నీటిని ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి సులభంగా సరఫరా చేయవచ్చని తెలిపారు. ఓఆర్‌ఆర్ వరకు సివరేజీ కొరకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ డీ.శ్రీధర్ బాబు, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీర కృష్ణ పాల్గొన్నారు.