హైదరాబాద్

ఓటరుగా నమోదు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, సెప్టెంబర్ 20: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించు కోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా కార్యాలయానికి విచ్చేసి కలెక్టర్ ఎంవీ రెడ్డితో సమావేశమై జిల్లాకు సంబంధించిన ఓటరు జాబితా, సవరణలు, ఈవీఎంలు, స్వీప్ యాక్టివిటీస్‌పై సమీక్షించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శామీర్‌పేట్‌లోని సింగాయిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని రజత్ కుమార్, కలెక్టర్ పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రంలో వౌళిక వసతులపై ఆరా తీసారు. దివ్యాంగులకు ర్యాంప్, వీల్ చైర్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గుట్కాల గోదాంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి
మేడ్చల్, సెప్టెంబర్ 20: గుట్టుచప్పుడు కాకుండా నిషేదిత గుట్కాల వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్న ఓ వ్యాపారి స్థావరంపై బాలానగర్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు కచ్చితమైన సమాచారం మేరకు దాడి నిర్వహించి అతడి ఆటను కట్టించారు. ఎస్‌ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పురపాలక సంఘం అత్వెల్లి పరిధిలో నివాసం ఉంటున్న మేకల రాజు(50) పట్టణంలోని బాలాజీనగర్‌లో నిషేదిత గుట్కాలు సరఫరా చేసేందుకు గిడ్డంగిలో నిల్వచేశాడు. అందులో రూ. 4.54 లక్షల నిషేదిత గుట్కాలను నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు గిడ్డంగిపై దాడి నిర్వహించి రూ.4.54 లక్షల విలువ గల వివిధ బ్రాండ్‌ల పేరుతో ఉన్న నిషేదిత గుట్కాల సంచుల స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు మేకల రాజును అదుపులోకి తీసుకుని స్థానిక మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా స్థానిక పోలీసులకు తెలియకుండా ఇంత పెద్ద మొత్తంలో నిషేదిత గుట్కాల వ్యాపారాన్ని దర్జాగా నిర్వహిస్తున్న వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అని సామాన్యులు నమ్మడం లేదు. ఒకవేళ తెలియకుండా జరిగినా పోలీసుల నిర్లక్ష్యం, నిఘా కొట్టొచ్చినట్లు అర్ధమవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో నాలుగు సార్లు నిషేదిత గుట్కాల నిర్వాహకుల అరెస్టు చేసి కేసులు నమోదు చేసినా దాఖలాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో నిలువరించడంలో మేడ్చల్ పోలీసులు విఫలమయ్యారని విమర్శలు విన్పిస్తున్నాయి.

నాబార్డ్ సహకారంతో చిరుధాన్యాలపై సదస్సు
వికారాబాద్, సెప్టెంబర్ 20: నాబార్డ్ తెలంగాణ రీజియన్ ఆర్థిక సహాయంలో గురువారం వికారాబాద్ జిల్లా సర్పన్‌పల్లిలో చిరుధాన్యాల సాగు ఉత్పత్తి వాటి ఆహార పదార్థాలపై రైతులకు సందర్శన కార్యక్రమం నిర్వహించారు. రాజేంద్రనగర్ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ, భారతీయ కృషి అనుసంధాన పరిషత్ ప్రధాన శాస్తవ్రేత్త డాక్టర్ బీ.సుబ్బారాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చిరుధాన్యాల సాగుపై సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగ నైపుణ్యతను అభివృద్ధి చేసేందుకు రైతులు, యువత కొరకు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈప్రాంతంలో గతంలో చిరుధాన్యాలను సాగు చేసేవారని గుర్తుచేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితలను, సాగు చేసిన పంట దిగుబడి, ప్రతికూల వాతావారణం, వర్షాభావ పరిస్థితులను బట్టి రైతులు ఈ ప్రాంతంలో పత్తి, కంది, చెరకు పంటలను పండిస్తున్నారని చెప్పారు. కిలో వరి బియ్యాన్ని సాగు చేసేందుకు ఐదు వేల లీటర్ల నీరు అవసరమైతే, కిలో చిరుధాన్యాలు పండించేందుకు కేవలం 450 లీటర్ల నుండి 600 లీటర్లు అవసరమని పేర్కొన్నారు. తక్కువ నీటి లభ్యతతో ఎక్కువ చిరుధాన్యాలు పండించవచ్చని అన్నారు. తక్కువ ఖర్చుతో తేలికపాటి నేలల్లో పంటను సాగు చేయవచ్చని, మారుతున్న పరిస్థితలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మధుమేహం, రక్తపోట, ఉబకాయం మొదలగు వాటికి చిరుధాన్యాలు మందుల్లా పనిచేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో శాస్తవ్రేత్తలు డాక్టర్ ఎస్‌ఎస్ రావు, సీహెచ్ శశిధర్ రెడ్డి, సంధ్యారాణి, వెంకటేశ్వర్లు, జాను జాకబ్, జీ.కృష్ణా రెడ్డి, మాజీ సర్పంచ్ ఫకీర్‌లు, స్వయం శక్తి ఫౌండేషన్ ఎన్‌జీవో బీ.వీర్ శెట్టి పాల్గొన్నారు. గ్రామంలో స్వచ్ హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రతిజ్ఞ చేశారు.