హైదరాబాద్

బాలుకు వంశీ సంగీత పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, సెప్టెంబర్ 21: పద్మభూషణ్ డా.అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రముఖ సినీ గాయకుడు బాల సుబ్రహ్మణ్యంకు ‘అక్కినేని - వంశీ’ సంగీత పురస్కారం ప్రదానోత్సవం వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని బాల సుబ్రహ్మణ్యంకు సంగీత పురస్కారం ప్రదానం చేశారు. బాలు అనేక చిత్రాలలో వేల పాటలను అలపించారని అన్నారు. అక్కినేని నాగేశ్వర రావు పేరిట పురస్కారం ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. గాయనీ శారద ఆకునూరి ‘నేల మీద జాబిలి..అక్కినేని - బాలు శతగీత లహరి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. సామాజికవేత్త డా.కొత్త కృష్ణవేణి దంపతులు బాల సుబ్రహ్మణ్యంకు వీణను బహుకరించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణాచారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రజానటి జమున, కళాతపస్వీ డా. కే.విశ్వనాథ్, సీల్‌వెల్ కార్పోరేషన్ చైర్మెన్ బండారు సుబ్బారావు, సినీ దర్శకులు కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, కేర్ హాస్పటల్స్ డా. ఎస్.విజయ్‌మోహన్, సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, మణిశర్మ, పట్నాయక్, కేఎం రాధాకృష్ణన్, లయన్ విజయ్‌కుమార్, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, రాఘవాచారి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, అధ్యక్షురాలు తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.