హైదరాబాద్

మోడల్ పోలింగ్ కేంద్రం ఎన్నికలపై సిబ్బందికి..ఈవీఎంలపై ఓటర్లకు 24 నుంచి అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: జీహెచ్‌ఎంసీలో ముందస్తు ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఇప్పటికే ఒకవైపు ఓటరు జాబితా సవరణ ప్రక్రియను చేపడుతూనే మరోవైపు ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల్లో వౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టిన అధికారులు ఈ నెల 24వ తేదీ నుంచి ఓటర్లకు, సిబ్బందిని వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వినియోగించనున్న అత్యాధునికమైన సరికొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఇప్పటికే నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే! వాటికి అనుసంధానం చేయనున్న వీవీ ప్యాడ్‌లు కూడా సిటీకి వచ్చిన తర్వాత కొత్త ఈవీఎంలలో ఓటరు తన ఓటు సద్వినియోగం చేసుకునే తీరు, ఓటు సద్వినియోగం అయిందా? లేదా? అన్న విషయాన్ని ఎలా సరిచూసుకోవచ్చునన్న అంశంపై ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు వేలాదిమంది నగరవాసులు రకరకాల పనులపై వచ్చే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మోడల్ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఈవీఎం, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాడ్‌లకు సంబంధించిన నమూనాలను కూడా ఏర్పాటుచేసి, వాటిని ఎలా వినియోగించాలన్న విషయంపై వివరించనున్నారు. ఈ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఈనెల 24వ తేదీన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఈవీఎంల పనితీరుపై ఎన్నికల సిబ్బంది, అధికారుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల విధులకు నియమితులైన ఉద్యోగులంతా విధుల్లో చేరాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కావల్సిన స్థాయిలో సిబ్బంది విధి నిర్వహణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. విధుల్లో చేరనివారి, చేరిన తర్వాత విధులు సక్రమంగా నిర్వహించని వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఓటరు తుది జాబితాను జారీ చేసిన తర్వాత అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థుల వ్యయ అంచనాలు వంటి అంశాలపై ఇప్పటికే నియమితులైన నోడల్ అధికారులకు కూడా ప్రత్యేకంగా శిక్షణనిచ్చే అవకాశముంది. ఓటరు జాబితాలో తప్పులను సరిచేసే విధులు పూర్తికావటంతో ఓటరు తన ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునే అంశంపై, ఈవీఎంల వినియోగం వంటి అంశాలకు ప్రచార, అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.