హైదరాబాద్

28న మెడికల్ షాపుల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 21: ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిరసిస్తూ ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 28న రాష్ట్రంలో బంద్‌ను పాటిస్తున్నట్టు తెలంగాణ కెమిస్ట్, డ్రగిస్టు అసోసియేషన్ పేర్కొంది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బంద్‌కు సంబంధించిన బ్రోచర్‌ను అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్ రావు, సతీష్ రావు ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల మంది డ్రగిస్టులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 20వేల మంది ఉండగా, వారిపై ఆధారపడి ఆధారపడి సుమారు కోటి కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఆన్‌లైన్ విధానాలు అమల్లోకి వస్తే రోగులతో పాటు మెడికల్ షాపుల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరతూ ఒక్కరోజు బంద్‌ను పాటిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్పందించ పోతే నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్, జిల్లా నాయకులు కుమార స్వామి, వెంకటేశ్వర్లు, దేవరాజ్, ఆంజనేయులు పాల్గొన్నారు.