హైదరాబాద్

నిమజ్జనానికి వేళాయే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: పదకొండు రోజుల పాటు భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న గణేషుడి నిమజ్జనానికి వివిధ ప్రభుత్వ శాఖలు సమష్టిగా భారీ ఏర్పాట్లు చేశాయి. ఏర్పాట్లను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ దాన కిషోర్, జాయింట్ కమిషనర్ సత్యనారాయణ శనివారం పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు, నీటిపారుదల, రోడ్లు, భవనాల శాఖ, విద్యుత్, జలమండలి తదితర శాఖలు లంబోదరుడికి వీడ్కొలు పలికేందుకు సర్వం సిద్ధం చేశాయి. గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ రూ.16.86 కోట్ల వ్యయంతో వివిధ రకాల పనులను చేపట్టింది. 23వ తేదీ ఆదివారం జరిగే నిమజ్జనానికి గ్రేటర్‌లో మొత్తం 117 క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వీలుగా 14వేల మంది లాఅండ్‌ఆర్డర్ పోలీసులు, మరో 2100 మంది ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు, ట్రాఫిక్ దారి మళ్లింపు విధి నిర్వహణలో పాల్గొననున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 18కి.మీ. పొడువున సాగే ప్రధాన శోభయాత్ర రూట్‌తో పాటు మొత్తం 370 కి.మీ. రూట్‌లో జరిగే నిమజ్జన ఊరేగింపునకు అడుగడుగున నిఘాను ఏర్పాటు చేశారు. ఎప్పటికపుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న పోలీసులకు, ఉన్నతాధికారులకు ప్రత్యేక సూచనలు, సలహాలిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి మధ్యాహ్నం నుంచి హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి సిబ్బంది, అధికారులకు సూచనలు చేయనున్నారు. 35 ప్రాంతాల్లో క్రేన్లను, మరో 96 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు. నిమజ్జన రూట్‌లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయగా, ప్రజల సౌకర్యార్థం 92 మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచారు. భారీ విగ్రహాలను మండపాల నుంచి వాహనంలోకి ఎక్కించేందుకు ఈ మొబైల్ క్రేన్లను వినియోగించనున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో 16, ట్యాంక్‌బండ్‌పై 12 క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు. సాగర్, సరూర్‌నగర్ చెరువుల వద్ద ప్రతి సంవత్సరం నీటి పారుదల శాఖ ఏర్పాటు చేయాల్సిన క్రేన్లను ఈ సారి జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయనుంది. ఏదైనా విపత్తు సంభవించిన తక్షణమే సహాయం అందించేందుకు డిజాస్టర్ రెస్క్యు దళాలను సిద్దం చేశారు. నిమజ్జనం కారణంగా పోగయ్యే చెత్తాచెదారాన్ని ఎప్పటికపుడు తొలగించేందుకు అదనంగా శానిటేషన్ సిబ్బంది నియమించారు. నిమజ్జనం మరుసటి రోజైన సోమవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశముండటంతో హుస్సేన్‌సాగర్ వద్ద షిఫ్టుల పద్ధతిలో సిబ్బందిని నియమించారు. మొత్తం 1400 మంది పారిశుద్ద్యం సిబ్బందిని, 719 మంది శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లను నియమించారు.

గజ ఈతగాళ్లు.. స్పీడ్ బోట్‌లు
నిమజ్జనం జరిగే అన్ని చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు, ఒక్క హుస్సేన్‌సాగర్ వద్దనే పది మంది గత ఈతగాళ్లను, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 11 స్పీడ్ బోట్‌లను అందుబాటులో ఉంచారు. విద్యుత్ విభాగం ద్వారా సుమారు రూ. 94.21లక్షల వ్యయంతో 34926 తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేశారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 15 కిలోమీటర్ల మేరకు బ్యారికేడింగ్ చేయనున్నట్లు, శోభాయాత్ర ప్రధాన రూట్‌లోని 15 ప్రాంతాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లను వేయనున్నట్లు వివరించారు. రోడ్లు, భవనాలు, విద్యుత్ విభాగాల ఆధ్వర్యంలో 75 జనరేటర్లను ఏర్పాటు చేయనున్నారు. నిమజ్జనం తిలకించేందుకు వచ్చిన జనం సౌకర్యార్థం మూడు లక్షల వాటర్ ప్యాకెట్లను, మూడు వాటర్ శిబిరాల్లో అందుబాటులో ఉంచనున్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ మొత్తం 48 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రధాన రూట్‌లో 38 ఫైర్ ఇంజన్లను, జీహెచ్‌ఎంసీ తరపున గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడైనా రోడ్డుపై గుంతలు ఏర్పడినా, అప్పటికపుడే వాటిని పూడ్చేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 20 గణేష్ నిమజ్జన కొలనులను శుభ్రపరిచి, వాటిలో శుభ్రమైన నీటిని నింపి సిద్దంగా ఉంచారు. ఇందుల్లో, హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువుల్లో నిమజ్జనం చేసే విగ్రహాల వ్యర్థాలను అప్పటికపుడే తొలగించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు.

మధ్యాహ్నం 12గంటలకే ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం
రాష్ట్రంలోని అతి పెద్ద ఖైరతాబాద్ గణనాధుడిని ఈ సారి మధ్యాహ్నం పనె్నండు గంటలలోపే నిమజ్జనం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భారీ గణపయ్యకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఐరన్ ఫ్రేమ్‌లను శనివారం ఉదయం నుంచే తొలగించటం ప్రారంభించారు. ఉదయం ఆరు గంటలకు వాహనంపైకి ఎక్కించి, మధ్యాహ్నం పనె్నండు గంటల కల్లా నిమజ్జనం చేసేందుకు వివిధ విభాగాల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
జలమండలి నోడల్ అధికారులు
నగరంలో రెండు రోజుల పాటు కోనసాగనున్న గణేష్ నిమజ్జనానికి జలమండలి ఆధ్వర్యంలో సామూహిక ఊరేగింపులో పాల్గొనే భక్తుల సౌకర్యర్థం వాటర్ క్యాంప్‌లను ఏర్పాటు చేసింది. వీటి పర్యవేక్షణ కోసం నియమించిన నోడల్ అధికారుల వివారాలిలా ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా నోడల్ అధికారిగా ఏ.సురేష్‌బాబు (్ఫన్ నెంబర్ 9908864777), రంగారెడ్డి జిల్లా నోడల్ అధికారిగా ఎంబీ.ప్రవీణ్‌కుమార్ (్ఫన్ నెంబర్ 9989986006), సెంట్రల్ జోన్‌కు జీఎం ఎస్‌వీ.రమణ రావు (9989988731), ఈస్ట్ జోన్‌కు జీఎం దామోదర్ రెడ్డి (9989998836), నార్త్ జోన్‌కు ఎస్.రాజశేఖర్ (9989989535), దక్షిణ మండలంకు పీ.నాగేందర్ కుమార్ (9989989507), వెస్ట్‌జోన్‌కు వీ.వీనోద్ భార్గవ (9989987825), సర్ధార్ మహాల్ జాయింట్ కాంట్రోల్ రూమ్‌కు డీజీఎం పీవీ రమణారెడ్డి (9989985512), గాంధీనగర్ పీఎస్, ట్యాంక్‌బండ్ నోడల్ అధికారిగా డీజీఎం.సునీల్ (9989991221)ను నియమించారు.