హైదరాబాద్

నిమజ్జన బందోబస్తు - రంగంలో భారీగా బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: జంటనగరాల్లో ఆదివారం జరగనున్న గణేష్ శోభాయాత్రలో భద్రత కోసం 19వేల మంది పోలీసు బలగాలను సిద్ధం చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఆదివారం రాత్రికే దాదాపు గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయడానకి ప్రయత్నిస్తామని, ఖైరతాబాద్ గణేష్ విగ్రహం సోమవారం ఉదయానికి నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయడానకి 15వేల గణేష్ విగ్రహాలు తీసుకువస్తున్నట్లు నిర్వాహాకులు సూచించారన్నారు. జంటనగరాల్లో గణేష్ శోభాయాత్రలో పాల్గొనడానికి వస్తున్న భక్తులకు సౌకార్యలను ఏర్పాటు చేశామని, ప్రతి అంశాన్ని పర్యక్షించడానికి కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని దీంతో ఎక్కడ ఏమి జరుగుతోందో క్షణాల్లో తెలిసిపోతుందన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 2,5 లక్షల సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వందతులు నమ్మవద్దని సమాచారం కోసం స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు.

ఎగ్జిబిషన్ సొసైటీ నూతన కార్యవర్గం
హైదరాబాద్, సెప్టెంబర్ 22: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ (2019-2020)కి నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఉపాధ్యక్షునిగా బి. శ్రీనివాస రావు, కార్యదర్శిగా జి.వి. రంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా బి. సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, డి. మోహన్, రాజేందర్, బిఎన్ రాజశేఖర్, డాక్టర్ ఎన్. సంజీవ్ కుమార్, వి. సత్యబ్ధర్, హరినాథ్, సూర్యకుమార్ భగ్వగ్లేకర్ ఎన్నికయ్యారు.