హైదరాబాద్

ఓటరు జాబితా సవరణకు 77 వేల ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలాంటి లోపాలు, తప్పుల్లేని ఓటరు జాబితా సవరణ చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రతి ఓటరు వివరాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, అందులో లోపాలను సరి చేయటంతో పాటు మృతి చెందిన వారి ఓట్లను తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టింది.
ఈ నెల 25వ తేదీన వరకు అభ్యంతరాలను సమర్పించటంతో పాటు తప్పులను సరి చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే! ఓటరు జాబితా సవరణపై ఇప్పటి వరకు 77వేల 622 దరఖాస్తులు రకరకాల అభ్యంతరాలు, దరఖాస్తులొచ్చినట్లు కమిషనర్ దాన కిషోర్ శనివారం వివిధ రాజకీయపార్టీల నేతలతో నిర్వహించిన సమావేశం అనంతరం వెల్లడించారు. వచ్చిన మొత్తం 77వేల 622 దరఖాస్తుల్లో 38,249 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో, మిగిలిన 39,373 ఆఫ్‌లైన్‌లో వచ్చినవిగా వివరించారు. జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు ఈ ఏడు జారీ చేసిన డెత్ సర్ట్ఫికెట్ల వివరాలను బట్టి, ఇప్పటి వరకు 4వేల మంది మృతి చెందిన ఓటర్ల వివరాలు జాబితాలో ఉన్నట్లు గుర్తించామని, ఈ మేరకు వారి కుటుంబానికి నోటీసులు జారీ చేసి, వారి సంతకాలను స్వీకరించి, ఆ ఓట్లను తొలగించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మరో ఆరువేల మంది ఓటర్ల వివరాల్లో అడ్రస్‌లు రిపీట్ అయినట్లు, వీటిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. 11వేల 974 మంది తమ చిరునామాలను మార్చుకున్నట్లు గుర్తించామని తెలిపారు. మరో 60వేల ఓట్లకు సంబంధించి ఫొటోలు అయోమయంగా ఉన్నట్లు గుర్తించామని, వీటిని సరిచేసే ప్రక్రియ పురోగతిలో ఉందని వివరించారు. క్లెయిన్‌లు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనున్నందున చివరి సమయంలో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశముండటంతో ఒక్కో సర్కిల్‌కు ప్రస్తుతం 20 మంది డేటా ఆపరేటర్లు రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మున్ముందు అవసరాన్ని బట్టి, ఒక్కో సర్కిల్‌కు మరో వంద మంది డేటా ఆపరేటర్లను కూడా నియమించాలని యోచిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలు, క్లెయిన్‌లను పరిష్కరించి, వచ్చే నెల 8వ తేదీన నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఓటరు జాబితాపై వివిధ రాజకీయపార్టీలు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేయటం మామూలేనని కమిషనర్ దాన కిషోర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓటరు జాబితాలో రెండు,మూడు చోట్ల నమోదై ఉన్న ఓటరు వివరాలను, మృతి చెందిన వారి ఓటు వివరాల తొలగింపు వంటి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తొలగించేలా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.
ఒకటిన్న ఎక్కువ చోట్ల నమోదైన ఓటరుకు నోటీసు జారీ చేసి, ఓటరు కోరిన చోటే ఓటు వివరాలను కొనసాగిస్తూ, వారి అనుమతితో మిగిలిన చోట్ల వివరాలను తొలగించనున్నట్లు, అలాగే మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా నోటీసులు జారీ చేసి, వారివద్దనున్న డెత్ సర్ట్ఫికెట్‌ను, అందులోని వివరాలను పరిశీలించిన తర్వాత వారి కుటుంబం అనుమతి, సంతకాలను తీసుకున్న తర్వాతే ఓట్లను తొలగిస్తున్నట్లు, ఈ రకంగా ఇప్పటి వరకు 2వేల 732 ఓట్లను తొలగించామని కమిషనర్ తెలిపారు.