హైదరాబాద్

భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర.. ప్రశాంతంగా నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, సెప్టెంబర్ 23: కంటోనె్మంట్ - అల్వాల్‌లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం నుంచి మండపాలలో ఉన్న మూర్తులను తరలించే కార్యక్రమం ప్రారంభించారు. మండపాలలో మూడవ రోజు నుంచి నిమజ్జనం చేస్తునే ఉన్నారు. కంటోనె్మంట్ బోయిన్‌పల్లి ప్రాంతంలోని విగ్రహాలను హస్మత్‌పేట చెరువులోకి తరలించగా మహేంద్రహిల్స్, మారెడ్‌పల్లి, వాసవినగర్, కార్కాన, వాసవినగర్ ప్రాంతంలోని వినాయక విగ్రహలను హుస్సేన్ సాగర్‌కు తరలించారు. తిరుమలగిరి, లోతుకరంట ప్రాంతాల విగ్రహాలను కూడ హుస్సేన్‌సాగర్‌కు తరలించగా బోల్లారం ప్రాంతం విగ్రహాలను అల్లాల్‌లోని బండ చెరువులో నిమ్మజ్జనం చేశారు. బోల్లారం జనప్రియ కాలనీ వద్ద జరిగిన పూజ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే జీ.సాయన్న పాల్గొన్నారు. ఓల్డ్ బోయిన్‌పల్లి లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి పూజలో పాల్గొన్నారు.
మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం డివిజన్‌లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను స్థానిక బండ చెరువులో నిమజ్జనం చేశారు. మండపాల వద్ద అఖరి పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీలు, బస్తీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అల్వాల్ పోలీస్ సిఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌకూర్‌లో జరిగిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంత రావు, కార్పొరేటర్ రాజ్‌జితేంద్రనాథ్ పాల్గొన్నారు. ఓల్డ్ అల్వాల్‌లో జరిగి పూజలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి, శ్రీనివాస్ రెడ్టి పాల్గొన్నారు.

కొందుర్గు: బొజ్జగణపయ్య నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువత గణేష్ మండపాల వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించి ఉట్లుకొట్టే కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ విజయ్ కుమార్, వివేకానంద సేవా సమితి సభ్యులు రవి, చింటు, శేఖర్, నర్సింలు, శివ కుమార్ పాల్గొన్నారు.

షాద్‌నగర్ రూరల్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11 రోజులు నిత్యపూజలందుకున్న విఘ్నేశ్వర స్వామికి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఆదివారం గణేష్ నిమజ్జనం సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని 23వార్డుల్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి భక్తిశ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కన్నుల పండువగా షాద్‌నగర్ మెయిన్‌రోడ్డు మీదుగా ఊరేగింపు సాగింది. గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులను చూసేందుకు ప్రజలు తండోపతండాలు భారీ స్థాయిలో తరలివచ్చారు. విఘ్నేశ్వర స్వామి శోభయాత్రలో పాల్గొన్న భక్తులకు వాసవి, వనితా క్లబ్‌లతోపాటు పలు స్వచ్చంద సంస్థల నిర్వాహకులు నీటి ప్యాకేట్లు, పులిహోర ప్యాకెట్లను అందజేశారు. షాద్‌నగర్ పట్టణంతోపాటు ఫరూఖ్‌నగర్, చుట్టుపక్కల గ్రామాల నుంచి చిన్నపెద్ద అనే తారతమ్యం లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గణేష్ శోభాయాత్రలో పాల్గొన్నారు.

దిల్‌సుఖ్‌నగర్: జై జై గణేష అంటూ ఆకట్టుకున్న భిన్న ఆకారాలతో విభిన్న మండపాలలో కొలువుదీరిన గణనాథులు విశేష పూజలను అందుకున్నారు. మండపాలలో కొలువుదీరిన గణనాథులను నిమజ్జన ప్రాంతమైన మినీ ట్యాంక్ బండ్‌గా ప్రసిద్ధి చెందిన సరూర్‌నగర్ చెరువు వద్దకు తరలించారు. సరూర్‌నగర్ చెరువు ప్రాంతమంత భక్తులతో కిటకిటలాడింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని శిరిడి సాయి బాబా ఆలయంలో ప్రతిష్ఠించిన వినాకుడి లడ్డును రూ.61వేలకు ఆలయ ధర్మకర్త ఎమ్.సాయికుమార్ దక్కించుకున్నారు. నిమజ్జనం సందర్భంగా సరూర్‌నగర్ పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. కట్టపై 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమజ్జన రహదారుల వెంట 60 సీసీ కెమెరాలను వీక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఆదివారం సుమారు వెయ్యి విగ్రహాలు నిమజ్జనం అయినట్లు సరూర్‌నగర్ సీఐ రంగస్వామి తెలిపారు.

కేపీహెచ్‌బీకాలనీ: గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. గణేష్ నిమజ్జనం శోభయాత్రను పురస్కరించుకుని కూకట్‌పల్లి ఐడీ ఎల్ చెరువు వద్ద బందోబస్తు, నిమజ్జన ఏర్పాట్లను ఆయన సందర్శించి పర్యవేక్షించారు. సైబారాబాద్ పరిధిలో సుమారు 26 చెరువులున్నాయని, నిమజ్జన ఏర్పాట్లకు 4000 మంది పోలీస్ సిబ్బందిని బందో బస్తుకు ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం ఐడీఎల్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన సీసీ టివిల ద్వారా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్ కుమార్, కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్ రావు, ట్రాఫీక్ ఏసిపీ చంద్రశేఖర్, కూకట్‌పల్లి సీఐ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
గచ్చిబౌలి: గచ్చిబౌలి పరిధిలో గణేష్ నిమజ్జనం ప్రశాంతగా జరుగుతుంది. 10 రోజుల నుండి భక్తుల పూజలందుకున్న లంబోదరునికి చివరి పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని ఖాజగూడ, రాయదుర్గం, మణికొండ తదితర ప్రాంతాల నుండి 26 విగ్రహలు హుస్సేన్‌సాగర్‌కు నిమజ్జనానికి తరలించారు. మల్కం చెరువు, ఖాజగూడ చెరువులో 11వ రోజు 33 విగ్రహాలను నిమజ్జనం చేశారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో108 విగ్రహలను నిర్వహకులు స్థానికంగా ఉన్న చెరువులో నియజ్జనం చేశారు. మాదాపూర్‌లోని దుర్గుం చెరువు వద్ద జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ ఏర్పాటు చేశారు. నిమజ్జనం చేస్తున్న దుర్గం చెరువు వద్ద భారీ క్రేన్ ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను, భారీ పోలీసు బలగాలను మోహరించారు. మాదాపూర్ నుంచి ఆరు విగ్రహాలు హుస్సేన్‌సాగర్ నిమజ్జనానికి తరలించగా 23 విగ్రహాలను దుర్గం చెరువుకు తరలించారు.
కాచిగూడ: వినాయక నిమజ్జం సందర్భంగా అంబర్‌పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట, విద్యానగర్, కాచిగూడ, బర్కత్‌పుర, నారాయణగూడ, హిమయత్ నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకులను నిమజ్జనం కోసం ట్యాంకుబండ్‌కు తరలించారు. ‘జైబోలో గణేష్ మహారాజ్‌కి జై.. అంటూ నినాదాలు చేస్తూ.. డప్పువాయిద్యలతో యువత నృత్యలు వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. బీజేపీ నాయకులు స్వాగత వేదికలను ఏర్పాటు చేసి గణనాథులకు స్వాగతం పలికారు. పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు పూలిహోర ప్యాకెట్లను పంచిపెట్టారు. ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నాట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు. కాచిగూడలో ఎర్పాటు చేసిన వినాయక మండపంలో గాయనీ, గాయకులు భక్తి పాటలను అలపించారు. బర్కత్‌పురలోని జీవీఆర్ కరాటే అకాడమీ విద్యార్థులు అకాడమీలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం కోసం ట్యాంకుబండ్‌కు తరలించారు. ప్రతి సంవత్సరం తమ అకాడమీలో కరాటే విద్యార్థులు వినాయకుడిని ఏర్పాటు చేసి 11రోజులు ఘనంగా పూజలను నిర్వహస్తామని అకాడమీ డైరెక్టర్ జీఎస్ గోపాల్ రెడ్డి తెలిపారు.
నార్సింగి: గణేష్ నవరాత్రులు పురస్కారించుకుని గణేష్ నిమజ్జనం అంత్యంత్త వైభవంగా జరిగింది. గణేష్ నిమజ్ఞనం ప్రశాంతమైన వాతావారణంలో ఆదివారం జరుపుకున్నారు. గండిపేట మండలం పరిధిలోని నెక్నాంపూర్‌లోని చెరువులో గణానాథులను నిమ్జనం చేశారు. మాజీ క ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పలు గణేష్ మండపాలలను దర్శించుకున్నారు. కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని పలు స్వాగత వేదికలను ఏర్పాటు చేశారు. స్వాగత వేదికలో బీజేపీ నాయకులు దేవర కరుణాకర్, అశోక్ యాదవ్, ఆకుల గోవర్దన్ రావు, పూర్ణ చందర్ రావు, ఇంద్రాసేనా రెడ్డి పాల్గొన్నారు. లంగర్‌హౌస్ పరిధిలో కూడా హనుమన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో లక్ష 25వేల రూపాయాలకు లడ్డు వేలంలో సత్యనారాయణ పాడారు. లంగర్‌హౌస్ గాంధీనగర్‌లో గణేష్ మండపంలో ఉట్టి కార్యక్రమంలో నిర్వహించారు.

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి, ఉడంగడ్డ, అరాంఘర్, పద్మశాలిపురం, బాబుల్‌రెడ్డి నగర్, సాయిబాబానగర్, కాటేదాన్, శివరాంపల్లి, ప్రేమావతిపేట్, బుద్వేల్ రైల్వే స్టేషన్ బస్తీ, హైదర్‌గూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి ప్రాంతాల్లో నెలకొల్పిన గణనాథుల ప్రతిమలను నిమజ్జనానికి తరలించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పత్తికుంట, పల్లె చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి బందోబస్తును పర్యవేక్షించారు.
గగన్‌పహాడ్‌లోని శ్రీశివ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో లడ్డూ వేలం నిర్వహించారు. భవానీకాలనీకి చెందిన ఔరాధి రమేష్ రూ.75 వేలకు దక్కించుకున్నాడు. అత్తాపూర్ గణేష్ లడ్డూను గుమ్మడి భూపాల్‌రెడ్డి బ్రదర్స్ రూ.2.51 లక్షలకు, మణికంఠ భక్త సమాజం ఆధ్వర్యంలో రూ.3.01 లక్షలకు శ్రీ్ధర్ రెడ్డి, ఎం.హర్షిత్ రెడ్డి, ఎం.వంశీగడ్, ఎం.త్రిభువన్ రెడ్డి కైవసం చేసుకున్నారు.

వికారాబాద్: మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలోని నేతాజీ యువజన సంఘం వినాయకుడి నిమజ్జనం డప్పుల చప్పుళ్ళు, యువకుల ఆనంద నృత్యాల మధ్య సాగింది. వార్డులోని బాలికలు కోలాటం ఆడి అందరిని మెప్పించారు. వేలంలో లడ్డూను రూ.68000కు నారాయణ రెడ్డిగాని వెంకట్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు.
కార్యక్రమంలో పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు డీ.ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ డీ.లక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.