హైదరాబాద్

అదరహో.. బాలాపూర్ లడ్డూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, సెప్టెంబర్ 23: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతి గడించి వినాయకులకే అధినాయకుడైన బాలాపూర్ గణనాథుని లడ్డూ వేలం పాటలో మరోసారి రికార్డును నమోదు చేసుకుంది. ఆదివారం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో ఏకంగా రూ.16 లక్షల 60 వేలకు మండల ఆర్యవైశ్య సంఘం తరఫున.. సంఘం అధ్యక్షుడు తేరెట్టిపల్లి శ్రీనివాస్ గుప్త కైవసం చేసుకున్నారు. గత ఏడాది జూబ్లీహిల్స్ అయ్యప్ప సొసైటీకి చెందిన నాగం తిరుపతిరెడ్డి రూ.15.60 లక్షలకు దక్కించుకున్నాడు. బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిగీతాలు ఆలపిస్తూ.. భజనలు చేస్తూ.. బాలాపూర్ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.
భారీ గణనాథుని ఊరేగింపు బాలాపూర్ బొడ్రాయి వరకు ఉదయం 10 గంటలకు చేరుకుంది. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూ వేలం పాట 10:15 నిమిషాలకు ప్రారంభించారు. వేలం పాటలో గతంలో లడ్డూ దక్కించుకున్న వారితో పాటు కొత్తగా తొమ్మిది మంది వేలం పాటలో పాల్గొన్నారు. పలువురు పోటీలో ఉన్నా.. చివరకు శ్రీనివాస్ గుప్త, ఎర్ర జైహింద్, కోలన్ రాంరెడ్డి, పన్నాల శ్రీకాంత్ రెడ్డి పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగిన వేలం పాటలో చివరకు శ్రీనివాస్ గుప్త లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం లడ్డూను శ్రీనివాస్ గుప్తకు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి, కమిటీ సభ్యులు అందజేశారు. అనంతరం శోభయాత్రగా గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్లాడు.
గణనాథుని కృపతో ఆర్యవైశ్యులతో పాటు అందరూ బాగుండాలనే కోరికతో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నట్లు శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. ఈ గణేషుని లడ్డూను దక్కించుకోవాలని గత ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గణనాథుని కృపతో ఈ సంవత్సరం లడ్డూ దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని గుప్త అన్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూకు ఎక్కడలేని గొప్ప శక్తి ఉందని, అందుకే వేలం పాటలో పాల్గొని దక్కించుకున్నట్లు తెలిపారు. మండల ఆర్యవైశ్య సంఘం సభ్యుల ప్రోత్సాహంతో సంఘం తరఫున వేలంపాట పాడి గణనాథుని లడ్డూను దక్కించుకున్నట్లు తెలిపారు.

నేతలకు అవకాశం ఇవ్వని నిర్వాహకులు
ఎన్నికలు ఉన్నందున పలువురు రాజకీయ నాయకులు వేలం పాటలో పాల్గొనాలని ఆశించినట్లు తెలుస్తున్నది. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు పోటీపడి వేలం పాటను అధికంగా పాడితే, వచ్చే ఏడాది ఇబ్బంది కావచ్చన్న నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు రాజకీయ నాయకులకు అవకాశం కల్పించలేదని తెలుస్తున్నది.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ప్రారంభమై నేటికి ఇరవై ఆరేళ్లు అయినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కొండ విశే్వశరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ యువనేత పీ.కార్తీక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి, బీజేపీ నాయకుడు శంకర్ రెడ్డి, దైవజ్ఞశర్మ, సరూర్‌నగర్ ఎంపీపీ తీగల విక్రంరెడ్డి, బడంగ్‌పేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.