హైదరాబాద్

లక్షల్లో అభ్యంతరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓటరు జాబితా సవరణ అంటేనే మహానగరంలోని ఓటర్లు పెదవి విరుపుగా వ్యవహారిస్తున్నారు. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటరు జాబితాలోని లోపాలు, తప్పులను సరిదిద్దేందుకు ఎన్ని సార్లు ప్రయత్నాలు చేసినా, ఉన్నతాధికారుల ప్రయత్నాలు ఫలించటం లేదు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు మంగళవారంతో గడువు ముగియనున్నందన జీహెచ్‌ఎంసీకి చెందిన అన్ని ఆఫీసుల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఫారం-6 కింద కొత్త ఓటర్ల నమోదు, ఫారం-7కింద ఉన్న సమాచారాన్ని సరిచేసుకోవటం, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటును బదిలీ చేసుకోవటం, రిపీట్ అయిన, మృతి చెందిన వారి ఓట్ల తొలగింపు వంటి ప్రక్రియలకు సంబంధించి మూడు రోజుల క్రితం వరకు 77 వేల క్లెయిమ్‌లు, అభ్యంతరాలు రాగా, ఈ సంఖ్య చివరి రోజు రెండింతలు అయినట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా ఈ జాబితా సవరణ కోసం డోర్ టు డోర్ సర్వే చేయాల్సిన విధులను నిర్వర్తించేందుకు సిబ్బంది ముందుకు రాకపోవటం, వచ్చిన సిబ్బంది క్షేత్ర స్థాయిలో తనిఖీలు సక్రమంగా నిర్వహించకపోవటంతో ఓటరు జాబితాలోని తప్పులు సరికావటం లేదు. ముఖ్యంగా గత 2014 ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న కొందరు ఓటర్ల వివరాలు ప్రస్తుతమున్న ఓటరు జాబితా ముసాయిదాలో కన్పించకపోవటంతో వారు బెంబేలెత్తుతున్నారు. ఏదైనా లోపం జరిగి ఓటు తొలగించారనుకుని, ముసాయిదా జారీ చేయకముందే మరోసారి ఫారం-6ను పూర్తి చేసి సమర్పించినా, ముసాయిదాలో తమ పేరు గల్లంతైనట్లు సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బీకే గూడకు చెందిన ఓ ఓటరు వాపోయారు. నగరంలోని మొత్తం 3వేల 826 పోలింగ్ కేంద్రాల పరిధుల్లో కనీసం సగం పోలింగ్ బూత్‌ల పరిధుల్లో ఎన్నికల సిబ్బంది డోర్ టు డోర్ సర్వే నిర్వహించలేదని ఓటర్లు వాపోతున్నారు. మరికొన్ని అభ్యంతరాలకు సంబంధించి ముసాయిదా జారీ చేయక ముందు తప్పుగా ఉన్న సమాచారాన్ని సరిచేయాలని దరఖాస్తు చేసుకున్న మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సాయినాథపురం ప్రాంతానికి చెందిన ఓ కొత్త ఓటరు తన వివరాలను ఓటరుగా నమోదు చేయాలని ఈ నెల 11న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 19న ఫీల్డు ఆఫీసర్ ఎంక్వైరీకి వస్తారని సందేశం వచ్చినా, నేటికీ సదరు ఫీల్డు ఆఫీసర్ ఎంక్వైరీ చేయలేదని, త్వరలో జారీ చేయనున్న తుది ఓటరు జాబితాలో తమ వివరాలుంటాయా? తనకు ఓటు హక్కు కల్పిస్తారా? అంటూ ఓటరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ పేజీలు కూడా అందుబాటులో లేవని ఓటర్లు అంటున్నారు. ఓటరు జాబితా సవరణలో నాలుగు రకాల ప్రక్రియలకు సంబంధించి నాలుగు రకాల దరఖాస్తులు, అభ్యంతరాలు, క్లెయిమ్‌లు వచ్చినా, వీటిలో ఓటర్ల తొలగింపు ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ కొత్తగా 18 ఏళ్లు నిండిన వారి వివరాలను ఓటర్లుగా జాబితాలోకి కూడా ఎక్కించకపోవటం గమనార్హమని, ఎన్నికల సిబ్బంది పనితీరుకు నిదర్శనమని ఓటర్లు విమర్శిస్తున్నారు.