హైదరాబాద్

దానం వైఖరి మార్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, డిసెంబర్ 13: తెరాస పార్టీ అభివృద్ధి సంక్షేమంతో ముందుకు సాగుతున్న పార్టీ కాని బెదిరింపులకు దాడులకు పాల్పడే పార్టీ కాదని తెరాస గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ వల్లే బంగారు తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని నమ్మిన ఇతర పార్టీల నేతలు తెరాసలో చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల కారణంగా నేతలు కార్యకర్తలు తెరాసలో చేరుతుంటే ప్రతిపక్షాలు తమ ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మైనంపల్లి పేర్కొన్నారు. ఎవరిని ప్రలోభపెట్టాల్సిన అవసరం తెరాసకు లేదని ఆ నైజం తెరాసపార్టీది కానేకాదని అనవసర ఆరోపణలు ప్రతిపక్షాలు మానుకోవాలని ఆయన హితం పలికారు. సిఎంను, నాయిని నర్సింహ్మారెడ్డిని విమర్శించే నైతిక హక్కు దానంకు లేదని అన్నారు. తెరాసలో చేరడానికి దానం చర్చలు జరిపారని అన్నారు. దానం నాగేందర్ తన ప్రవర్తనను మార్చుకోవాలని, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను చీల్చడానికి సెటిల్‌మెంట్‌లకే మరిమితం అయ్యారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఎవరు ఏంటనే విషయం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. తెరాసలో చేరుతున్న నేతల గురించి విమర్శించే నైతిక హక్కు వారికి లేదని ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం తెరాసకు ఎంతమాత్రం లేదని తెలిపారు. నేడు ఆరోపించే నేతలే రేపు తెరాసలో చేరాల్సి వస్తుందని మర్చిపోరాదని హితవుపలికారు. నగరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులే లేకుండాపోయారని, ఇక తెదేపాకు కార్యకర్తలు కూడ లేకపోవడంతో పార్టీలు ఉనికిని కోల్పోవాల్సి వస్తుందని బెంబేలు పడుతున్నారని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఈ ఆరోపణలు చేస్తున్న పార్టీలకు కనీసం డిపాజిట్‌లు కూడా దక్కించుకోలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఇక షబ్బీర్ అలీకి బెదిరింపులు వస్తే ఆధారాలతో సహా పోలీసుల దృష్టికి తీసుకుపోవాలి కాని ప్రచార ఆర్భాటం కోసం ప్రభుత్వంపై అభాండాలు వేయడం శోచనీయమని అన్నారు.
నిజంగా ఎవరైనా బెదిరింపులు చేస్తే చట్టం దృష్టికి తీసుకుపోవాలి కాని ఇలా అనసరంగా ప్రభుత్వమే చేయించింది, తెరాస నేతలే చేశారని ఆరోపించడం సరికాదని హితవుపలికారు. ఎవరు ఎన్ని చేసినా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని మైనంపల్లి పేర్కొన్నారు.