హైదరాబాద్

బతుకమ్మకు ప్రపంచ స్థాయి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట: ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నట్లు సికిందరాబాద్ ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీ. ఆంజనేయులు కొనియాడారు. బుధవారం సికిందరాబాద్ ప్యాట్నీ ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. 150 మంది బ్యాంక్ ఉద్యోగినులు బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సతీమణి నుంచి క్రింది స్థాయి ఉండే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినులు అందరూ ఒకచోట చేరి అందంగా బతుకమ్మను పేర్చి ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’’ అంటూ ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షురాలు మీరా స్వామినాథన్, సభ్యులు విజయలక్ష్మి, రమేష్, అనురాధ మాయా, సత్యప్రసాద్, ఎస్‌బీఐ డీజీఎంలు రవీంద్ర గురవ్, సుధీర్ కుమార్ శర్మ పాల్గొన్నారు.
బాలానగర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. డివిజన్ నరిధిలోని పంచవటి కాలనీ ప్రాంతంలో తెరాస కూకట్‌పల్లి పరిశీలకులు ఆవుల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో అలరించారు. ఫతేనగర్ డివిజన్‌లో శోభన కాలనీ, గౌతంనగర్ ప్రధాన రహదారిలోని బతుకమ్మ రోడ్డులో స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి రకరకాల పూలతో అలంకరించిన బతుకమ్మలను ఉంచి లయబద్ధంగా అడుగులు వేస్తూ పాటలు పాడారు. మరికొందరు మహిళలు కోలాటాలతో నృత్యాలు చేయగా, కృష్ణారావుకూడా వారితోపాటు ఆడిపాడారు.
కొడంగల్: పట్టణంలోని నవీన ఆదర్శ కానె్వంట్ ప్లే అండ్ హైస్కూల్‌లో బుధవారం బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మివెంకటయ్య ముదిరాజ్, ప్రిన్సిపాల్ నరేష్‌రాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులు తీరొక్క పూలను సేకరించి బతుకమ్మలుగా పేర్చి ఆట పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. బతుకమ్మలను నెత్తిన పెట్టుకుని అంబేద్కర్ చౌరస్తాలో బోడ్డేమ్మలను వేశారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ దేవస్థాన పుష్కరిణిలో నిమజ్జనం చేశారు.
ఆమనగల్లు: ఆమనగల్లుతో పాటు వివిధ గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని అంగన్‌వాడీ కార్యలయ ఆవరణలో సూపర్‌వైజర్లు, ఆయాలు, సిబ్బంది బతుకమ్మ ఆట పాటలతో సంబురాలు జరుపుకున్నారు. బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. సూపర్‌వైజర్ శబరి సిబ్బంది సునీత, భీమయ్య, పాల్గొన్నారు.