హైదరాబాద్

సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాబోవు ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని, ఆ దిశగా జిల్లా నోడల్ అధికారుల బృందం సమన్వయంతో, అంకితభావంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి నోడల్ అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు, ఆదేశాలను జారీచేశారు. జిల్లా ఎన్నికల అమలు ప్రణాళికను వెంటనే ప్రణాళికబద్దంగా రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. సిబ్బందికి తగు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా తగు బందోబస్తు కోసం పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాల్సిందిగా తెలిపారు. జిల్లాలో ఎక్కడ కూడా గోడలపై వ్రాతలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు లేకుండా చూడాలని ఆదేశించారు. నామినేషన్ దాఖల చేసిన అభ్యర్థుల కోసం హ్యాండ్‌బుక్, అకౌంట్ బుక్స్ ఇచ్చేందుకు ముందస్తుగానే రూపొందించుకోవాలని సూచించారు. ఫిర్యాదుల విభాగాన్ని, సహాయ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో పరిష్టం చేసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆధునీకరించుకోవాలని సూచించారు. జాతీయ ఫిర్యాదుల విభాగంతో తగు సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించారు. కమ్యూనికేషన్ ప్లాన్‌ను రూపొందించాల్సిందగా కోరారు. ఈ విధులపై రోజువారి నివేదికలను క్రోడీకరించి జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సిందిగా తెలిపారు. సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్, జిల్లా అదనపు ఎన్నికల అధికారి, డిఆర్‌ఓ ఉషారాణి పాల్గొన్నారు.