హైదరాబాద్

వైభవంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని పలు అమ్మవారి దేవాలయాల్లో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రాచీన ఆలయాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల్లో దుర్గమాత విగ్రహాలను ప్రతిష్ఠించి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఆయా దేవాలయాలతో పాటు పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సికింద్రాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కర్వాన్, లాల్‌దర్వాజ తదితర ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సావాల సందర్భంగా దేవాలయాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. దేవాలయాల్లో అనునిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలియాబాద్ న్యూ శంషీర్‌గంజ్ గాయత్రినగర్‌లోని శ్రీవిజయ దుర్గా మాత దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు రాజు, రాజేందర్, పీ.శంకరయ్య గౌడ్, రామ్, రాజు గుప్తా, మధుసూదన్ గుప్తా, సాయిచరణ్‌గౌడ్, అశ్విన్ చారి పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జంగమ్మెట్‌లోని జై దుర్గా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో టీపీసీసీ నిర్వహణ కార్యదర్శి పర్వతాల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఎస్.శంకర్, ఎ.లక్ష్మణ్‌రావు, అశోక్ కుమార్, మహేందర్, సాయికిరణ్, శివకుమార్ పాల్గొన్నారు.