హైదరాబాద్

రాజకీయ చైతన్యంతో బీసీల ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో బీసీలు రాజకీయ చైతన్యాన్ని నిరూపించుకోవాల్సి ఉందని బీసీ డిక్లరేషన్ ఆవిష్కరణ సభలో వక్తలు పేర్కొన్నారు. ఆదివారం లక్డీకపూల్‌లోని ఓ హోటల్‌లో బీసీల సమగ్ర ఆర్థిక, సామాజిక, రాజీకయ అభివృద్ధికై రూపొందించిన బీసీ డిక్లరేషన్ పుస్తకావిష్కరణ సభ జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, జస్టిస్ ఈశ్వరయ్య, టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, మాజీ ఎంపి, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కిగౌడ్ పాల్గొని ఆవిష్కరించారు. బీసీ సంఘం బీసీల స్థితిగతులపై లోతైన అధ్యయనం చేసి రూపొందించిన బీసీ డిక్లరేషన్ అమలైతే బీసీలు అన్ని రంగాల్లో అద్బుతంగా రాణిస్తారని అన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన బీసీ చైతన్య యాత్రలతో బీసీల రాజకీయ ప్రాధాన్యంపై చర్చ ప్రారంభం అయిందన్నారు. తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న బీసీలు ఇప్పటికీ పాలితులుగానే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం అన్ని పార్టీలు బీసీలకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడితే బడుగు, బలహీన వర్గాల పాలన వస్తుందని భావిస్తే దొరల పాలన వచ్చిందని మధుయాష్కి అన్నారు. జనాభా అతి తక్కువ శాతం ఉన్న దొరలు అధికారాన్ని చేజిక్కించుకొని విచక్షణ మరిచి పాలన సాగిస్తున్నారని అన్నారు. మహాకూటమి విజయం సాధిస్తే బీసలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ సామాజిక వర్గానికి లేని క్రిమిలేయర్‌ను బీసీలకు మాత్రమే కొనసాగించడం దారుణమని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బీఎల్‌ఎఫ్ నేత నల్లా సూర్యప్రకాష్, కాసం వెంకటేశ్వర్లు, ప్రభాకర్ పాల్గొన్నారు.

‘నుడి గుడి’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, అక్టోబర్ 14: ప్రముఖ రచయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి రచించిన ‘నుడి గుడి’ పుస్తకావిష్కరణ సభ రాజా వాసిరెడ్డి ఫౌండేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత ఆచార్య ఎన్.గోపి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగులో అరుదైన వాఖ్యాలను తీసుకుని పుస్తకాన్ని రచించారని పేర్కొన్నారు. రచయిత్రి మల్లీశ్వరి రచించిన వ్యాసాలు పరిశోధత్మకంగా ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. ప్రముఖ కవి బిక్కి కృష్ణ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, రచయిత ప్రభాకర జైని, తెలంగాణ రచయిత సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్, కవియిత్రి విజయ లక్ష్మీ, డా.లలిత పాల్గొన్నారు.