హైదరాబాద్

ఓటరు చైతన్యానికి ప్రత్యేక పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో నగర ఓటర్లలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! పోలింగ్‌లో మొట్టమొదటి సారిగా వినియోగించనున్న అత్యాధునికమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల వినియోగంపై ఓటర్లలో మరింత అవగాహన పెంపొందించేందుకు ‘్ఫటో పెట్టు-బహుమతి పట్టు’ అనే శీర్షికతో ప్రత్యేక ఫోటో పోటీలను నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఆదేశం మేరకు ప్రత్యేక నగదు బహుమతులను కూడా ప్రకటించారు. 18 ఏళ్లు నిండి, ఓటరుగా నమోదై, ఓటరు ఐడీ కార్డు కల్గిన నగర పౌరులు ఈ పోటీకి అర్హులుగా వివరించారు. కేవలం హైదరాబాద్ జిల్లాకు చెందిన వారై ఉండాలని సూచించారు. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా ఇతర ఓటర్లను ప్రోత్సహించేలా ఒక మంచి ఫొటో, లేక ఓటరు ఐడీకార్డును చూపుతూ ఉన్న ఫొటోతో కూడిన చక్కటి శీర్షికను జత చేసి ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఫోన్ నెంబరు 7993153333కు వాట్సప్ మెసేజ్‌ను చేయాలని సూచించారు. మెసేజ్‌తోపాటు పంపేవారు తమ పేరు, ఫోన్ నెంబర్, చిరునామాను కూడా జతచేయాలని అన్నారు. ఫొటోలు, శీర్షికలను పంపేవారు తప్పకుండా తమ ఓటరు ఐడీకార్డును కూడా జత చేయాలని తెలిపారు. ఈ రకంగా పంపిన ఫొటోలు, శీర్షికల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి, వాటిలో మొదటి బహుమతిగా రూ. 25వేలు, రెండో బహుమతిగా రూ. 20వేలు, మూడో బహుమతిగా రూ. 15 వేల నగదును అందజేయనున్నట్లు తెలిపారు.
ఓటు లేనివారు ఇప్పటికీ నమోదు చేసుకోవచ్చు
నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 ఏళ్ల వయస్సు నిండి, ఓటు హక్కు లేనివారు ఇప్పటికీ తాము ఓటరుగా నమోదు కావచ్చునని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో మీడియా సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, దివ్యాంగులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే అంశంపై దృష్టి సారించినట్లు తెలిపారు.