హైదరాబాద్

భారీ వర్షం.. ప్రధాన రహదారులు జలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సహాయక చర్యలపై మేయర్ పరిశీలన * వర్షంలోనే పర్యటించిన డిప్యూటీ మేయర్ బాబా
* భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు
హైదరాబాద్, అక్టోబర్ 17: మహానగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు పలు చోట్ల చిరుజల్లులు కురిసి, సాయంత్రం నాలుగు గంటల నుంచి దాదాపు గంటన్నర సేపు కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, సికిందరాబాద్ జనరల్ బజార్ తదితర ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్లు, సెల్లార్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తూ, మురుగు నీరు రోడ్డుపై ప్రవహించటంతో తీవ్ర దుర్గంధం నెలకొంది. దీంతో పాటు నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్, పంజాగుట్ట, రాణిగంజ్, ప్రకాశ్‌నగర్, లోయర్ ట్యాంక్‌మండ్, అశోక్‌నగర్ బ్రిడ్జి సమీపంలో భారీగా వర్షపు నీరు చేరటంతో సుమారు గంట సేపు వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ నుంచి సూచన వచ్చిన వెంటనే జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్.. బల్దియా అత్యవసర బృందాలు, డిజాస్టర్ రెస్క్యు ఫోర్స్‌లను అప్రమత్తం చేశారు. అప్పటికే ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మేయర్ బొంతు రామ్మోహన్ ఇక్కడి కమాండ్ కంట్రోల్ రూం నుంచి సహాయక చర్యలను పరిశీలించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎప్పటికపుడు అధికారులు తమ సర్కిళ్ల పరిధిలో భారీగా నీరు చేరిన ప్రాంతాల్లో నీటిని తోడివేసేందుకు క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించాలని ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికే పలు చోట్ల రోడ్లపై నిలిచిన నీటిని తోడివేసే పనిలో జీహెచ్‌ఎంసీ బృందాలు నిమగ్నమై ఉన్న సమయంలోనే మరోసారి సుమారు గంటన్నర సేపు భారీ వర్షం దంచికొట్టింది. తొలుత ఉస్మానియా విశ్వవిద్యాలయం, తార్నాక ప్రాంతాల్లో చిరుజల్లులుగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత క్రాస్‌రోడ్డు, గాంధీనగర్, ముషీరాబాద్, ఆబిడ్స్, నారాయణగూడ ప్రాంతాల్లో ఓ మోస్తారుగా కురిసింది. అప్పటికీ నాంపల్లి, ఎం.జే.మార్కెట్ ప్రాంతాల్లో వర్షం కురవలేదు. కానీ ఆ ప్రాంతాల్లో అరగంట సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడి రాకపోకలు అక్కడే నిల్చిపోయాయి.

ఫ్లైఓవర్లపై ప్రత్యక్ష నరకం
వర్షం కురిసినంత సేపు, ఆగిన తర్వాత కూడా రెండు నుంచి రెండున్నర గంటల పాటు ఫ్లై ఓవర్లు, మెయిన్ రోడ్లపై వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. ట్యాంక్‌బండ్‌పై వర్షంలో చిక్కుకుపోయిన వాహనదారులు అటూ ముందుకు, ఇటు వెనక్కి వెళ్లలేని పరిస్థితి. ఇందులో భాగంగా వర్షం ఆగిన తర్వాత కూడా బేగంపేట, మాసాబ్‌ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్లపై వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అమీర్‌పేట, మైత్రివనం ఖైరతాబాద్ వంటి బిజీగా ఉండే చౌరస్తాల్లో మొకాలి లోతు వరకు వర్షం నిల్వటంతో, దానికి తోడు సిగ్నల్స్ మొరాయించటంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి.

కేసీపీ జంక్షన్‌లో మోకాలిలోతు నీటి ప్రవాహం
ఖైరతాబాద్: నగరంలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్, కోఠి, అబిడ్స్ వంటి ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. కేసీపీ జంక్షన్ రహదారిపై మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రధాన రహదారులు, గల్లీల్లో సైతం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చిన్నపాటి వర్షానికి నీటితో నిండిపోయే పంజాగుట్ట రహదారిపై వరద నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. రాజ్‌భవన్ రోడ్‌లో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో రాకపోకలు కష్టతరంగా మారాయి. పంజాగుట్ట మోడల్ హౌస్, అమీర్‌పేట మైత్రీవనం, ఎర్రగడ్డ, బల్కంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నరకయాతన అనుభవించారు. జీహెచ్‌ఎంసి డిజాస్టర్ రెస్క్యూ టీం రంగంలోకి దిగిన రోడ్లపై నీటిని సాఫీగా సాగిపోయేలా చేశారు. పండుగ వేళ భారీ వర్షం కురడంతో నగర జ్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో భారీ బతుకమ్మలను ముస్తాబు చేసిన మహిళలు వాటిని వేదికల వద్దకు తీసుకురాకుండానే ఇంటికే పరిమితం అయ్యారు.