హైదరాబాద్

ట్యాంక్‌బండ్‌కు మళ్లీ నిమజ్జన శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: పదకొండురోజుల పాటు భక్తుల నుంచి ఘనంగా పూజలందుకుని, ఆ తర్వాత గంగమ్మ ఒడికి చేరే వినాయక నిమజ్జనం తరహాలో ట్యాంక్‌బండ్ మళ్లీ ప్రత్యేక శోభభు సంతరించుకుంది. గడిచిన నెల రోజులను గమనిస్తే పదకొండు రోజుల పాటు వినాయక ఉత్సవాలు, అందులో ఐదు దఫాలుగా నిమజ్జనోత్సవాలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్న ట్యాంక్‌బండ్ ఆ తర్వాత ప్రత్యేకమైన రంగురంగుల లైట్ల వెలుగులతో బతుకమ్మ సంబరాలకు ప్రధాన వేదికైంది. ఈ సారి వినాయక నిమజ్జనం, బతుకమ్మ, అమ్మవారి విగ్రహాల నిమజ్జనానికి పెద్దగా గ్యాప్ లేకుండా రావటంతో ట్యాంక్‌బండ్ విద్యుత్ వెలుగులతో దగదగలాడుతోంది. ఇపుడు అమ్మవారి విగ్రహాల నిమజ్జనోత్సవం ట్యాంక్‌బండ్‌పై అదనపు ఆకర్షణగా నిలిచింది. ఏటేటా నగరంలో అమ్మవారి ప్రతిష్టించే మండపాలు పెరుగుతుండటంతో క్రమంగా నిమజ్జన ఏర్పాట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈ సారి కూడా నవరాత్రి ఉత్సవాల్లో దశమి ఎపుడన్న విషయంపై ప్రజల్లో కొంత అయోమయం ఉన్నందున, శుక్రవారం కొన్ని విగ్రహాలు నిమజ్జనం నిమిత్తం ట్యాంక్‌బండ్‌కు కదిలాయి. కొందరు శుక్రవారం కూడా దసరా పండుగను జరుపుకోవటంతో అత్యధిక సంఖ్యలో అమ్మవారి విగ్రహాలు శనివారం నిమజ్జనానికి తరలే అవకాశాలున్నాయి. మరుసటి రోజైన ఆదివారం సెలవు కావటంతో పాతబస్తీ, బేగంబజార్, సికిందరాబాద్, హిమాయత్‌నగర్, కాచిగూడ, అంబర్‌పేట తదితర ప్రాంతాల నుంచి శనివారం సాయంత్రం ఎక్కువ సంఖ్యలో అమ్మవారి విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు తరలే అవకాశముంది. గతంలో నెక్లెస్‌రోడ్డులో రెండు నుంచి నాలుగు క్రేన్లను ఏర్పాటు చేసే అధికారులు ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాలు పెరుగుతుండటంతో అప్పర్‌ట్యాంక్‌బండ్‌పై కూడా అదనంగా క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై అమ్మవారి విగ్రహాల నిమజ్జనాన్ని ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు పోలీసులు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.