హైదరాబాద్

రాహుల్‌కు నేతల ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 20: హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్‌లో నిర్వహించిన రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీకి ఉప్పల్ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గం ఇన్‌చార్జి రాగిడి లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో సుధాకర్ శెట్టి, పుప్పాల వెంకటేశ్, రఫిక్, సంజయ్, ఆషు, సంతోష్, గణేష్ నాయక్, మాలూ నాయక్, మల్లిఖార్జున్, ఉస్మాన్, అరుణ్, మల్లేష్, చందు, మంజుల, రమా వందలాది మంది కార్యకర్తలో యాత్రలో పాల్గొన్నారు. రాజీవ్‌ను ఆకట్టుకునేందుకు నినాదాలు చేశారు.

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ
వికారాబాద్, అక్టోబర్ 20: జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీసు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

వృద్ధాశ్రమంలో ధాన్యం పంపిణీ
ఉప్పల్, అక్టోబర్ 20: పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని మేడిపల్లిలో వృద్ధాశ్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మద్ది యుగంధర్ రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా ఆహార ధాన్యం, పండ్లు పంపిణీ చేశారు. యుగంధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లా రెడ్డి, జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, ఎంపీటీసీ వీకే నాదం గౌడ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, నాయకులు దర్గ దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. వృద్ధుల సంక్షేమమే ధ్యేయమని పేర్కొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన
రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు
మేడ్చల్, అక్టోబర్ 20: టీఆర్‌ఎస్ పాక్షిక మేనీఫేస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో శనివారం రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు అపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. రెడ్డి జేఏసీ అసోసియేట్ చైర్మన్ అప్పమ్మగారి రాంరెడ్డి, జేఏసీ మహిళా చైర్మన్ మంజులా రెడ్డి మాట్లాడుతూ వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను కోరినట్లు తెలిపారు.
రెడ్డి కార్పొరేషన్‌కు భద్రత కల్పించాలని, ఉపాధిహామి పథకం వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కోరినట్లు వివరించారు. పేదరెడ్ల బాగుకోసం ఏ ప్రభుత్వం కృషి చేయలేదని, కేసీఆర్ టీఆర్‌ఎస్ మినీ మేనీఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు. కేసీఆర్‌కు కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ మహిళా కో కన్వీనర్ వసంత రెడ్డి, రాష్ట్ర వైస్ చైర్మన్ ఎన్. రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డిలతో పాటు 31 జిల్లాలకు చెందిన రెడ్డి జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ విశే్వశ్వర అన్నపూర్ణ ప్రతిష్టాపన
వికారాబాద్, అక్టోబర్ 20: జిల్లా కేంద్రం రైతుబజార్ సమీపంలో శ్రీ విశే్వశ్వర అన్నపూర్ణ ఆలయంలో ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
శనివారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, 24వ వార్డు కౌన్సిలర్ ఏ.సుధాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా విగ్రహాలకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కార్యక్రమంలో ప్లానర్ నర్సింలు, ఏ.ప్రభాకర్ రెడ్డి, ప్యాట మల్లేశం, నగేశ్ గుప్త పాల్గొన్నారు.