హైదరాబాద్

ఓటింగ్ శాతం పెంపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: రానున్న ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఓటు వేసిన తర్వాత ఓటరు తాను ఎంచుకున్న అభ్యర్థిగా ఓటు పడిందా?లేదా? అన్న విషయాన్ని సరిచూసుకునేందుకు ఈ సారి మొట్టమొదటి సారిగా వినియోగించనున్న వీవీప్యాట్‌లు, అధునాత ఈవీఎంలపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఓటింగ్ శాతం పెంపొందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా నగరంలోని 3826 పోలింగ్ కేంద్రాలను ఓటరు ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఆదేశించటంతో ప్రతి పోలింగ్ బూత్‌ను నేరుగా సందర్శించి, అక్కడ ప్రస్తుతమున్న పరిస్థితులు, ఓటరుకు అక్కడ సౌకర్యాలు కల్పించే పనిలో రిటర్నింగ్ అధికారులు బిజీగా ఉన్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ర్యాంపు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఓటర్ల వేచి ఉండేందుకు వీలుగా షామియానాల ఏర్పాటు, తగినంత ఫర్నిచర్ వంటి సౌకర్యాలను కల్పిస్తేనే పోలింగ్ బూత్‌లు ఓటరు ఫ్రెండ్లీ బూత్‌లుగా మారుతాయని కమిషనర్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. దివ్యాంగులు కూడా నూటికి నూరు శాతం ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా, పోలింగ్ కేంద్రానికి వెళితే ఎలాంటి అసౌకర్యం కలుగుతుందోనన్న భావనను వారిలో నుంచి తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిమగ్నమయ్యారు. వీల్ చైర్లలో పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వయోవృద్థుల సౌకర్యార్దం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంప్‌లను నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆకర్షితులయ్యేందుకు వీలుగా ఇప్పటికే స్లోగన్, ఫొటో పోటీలను నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ, ఇందులో విజేతలకు ఏకంగా నగదు పురస్కారాలను కూడా ప్రకటించి, అన్ని మార్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంపునకు కృషి చేస్తోంది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చేందుకు వీలుగా బ్రెయిలీ బ్యాలెట్లు, బ్లైండ్ పాఠశాల, కాలేజీల్లో, లెప్రసీ కాలనీల్లో అదనంగా పోలింగ్ బూత్‌ల ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించి బూత్ స్థాయి ఎన్నికల నిర్వాహణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.

గంజాయ రవాణా కేసులో విద్యార్థి అరెస్టు
ఉప్పల్, అక్టోబర్ 20: గంజాయికి బానిసలైన విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. కళాశాలకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ మత్తు పదార్థాలు సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. నిషేధించబడ్డ గంజాయిని విక్రయిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ గంజాయి వ్యాపారులపై ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు నిఘా పెట్టారు. ఆట స్థలాలు, రహస్య ప్రదేశాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. క్రమంలో శనివారం ఉప్పల్ బీరప్పగడ్డ ప్రాంతంలోని శ్మశాన వాటిక వద్ద స్వరూప్‌నగర్ పద్మావతి కాలనీకి చెందిన జీ.పృథ్వీరాజ్ (28)ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద బైక్, సెల్‌ఫోన్, గంజాయ్ బ్యాగును స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

వికారాబాద్ అభివృద్ధికి
వెయ్య కోట్లు కేటాయించాలి
వికారాబాద్, అక్టోబర్ 20: వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి వెయ్య కోట్లు కేటాయించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ బీ.వెంకట్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో గత 50 సంవత్సరాలుగా అభివృద్ధి నిరోధకులు పాలించి ఎండమావిలా మార్చారని, స్థానికేతరుల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా నిలబడిన దళిత సామాజిక వర్గానికి చెంది, పేద కుటుంబంలో పుట్టిన, క్రింది స్థాయి నుంచి పేదలకు సేవలందించేందుకు వచ్చాడని చెప్పారు. సమావేశంలో బీఎల్‌ఎఫ్ రాష్ట్ర నాయకుడు పీ.జంగా రెడ్డి, బీఎల్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ పీ.మల్లేశ్, ఎం.వెంకటయ్య, ఆర్.మహిపాల్, పీ.అశోక్, రామకృష్ణ, రాకేశ్ పాల్గొన్నారు.