హైదరాబాద్

రాష్ట్ర సరిహద్దులో నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 21: రానున్న శాసనసభ ఎన్నికలపై రాష్ట్ర సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రం సేడెంలో గుల్బర్గా ఎస్పీ శశికుమార్, వికారాబాద్ జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణతో కలిసి శాంతి భద్రతలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర సరిహద్దులలో చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటుచేసి అక్రమంగా తరలించే మద్యం, డబ్బును అరికట్టాలని రెండు జిల్లాల ఎస్పీలను కోరారు. సరిహద్దు గ్రామాలలో ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్నారు. శాసనసభ ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు సహకరించాలని గుల్బర్గా ఎస్పీని కోరారు.

2న దేవేందర్ యాదవ్ స్మారక రోడ్డు రేస్
హైదరాబాద్, అక్టోబర్ 21: అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ హైదరాబాద్, హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీన చిన్న బోయిన దేవేందర్ యాదవ్ స్మారక రోడ్డు రేస్ పోటీలను నిజామ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తారు. అండర్-10 విభాగం బాలబాలికలకు 1 కిలోమీటర్, అండర్-16లో బాలబాలికలకు 3 కిలో మీటర్లు, మాస్టర్ పురుషులు, మహిళల క్యాటగిరిలో 1 కిమీ, పురుషులు, మహిళల విభాగంలో 3 కిమీ మేర రన్‌ను నిర్వహించనున్నట్లు ఓయు వ్యాయామ విద్యా శాఖ ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్ తెలిపారు. పోటీలు వచ్చేనెల 2న ఉదయం ఆరు గంటలకు నిర్వహిస్తారు. రన్‌లో పాల్గొనదలిచిన అథ్లెట్‌లు వివరాల కోసం రన్ ఛీప్ కో ఆర్డీనేటర్ ఏ.జేవియర్‌ను ఫోన్ నెంబర్ 9959993268లో సంప్రదించవచ్చని తెలిపారు.