హైదరాబాద్

కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలి: వీహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 21: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలని మాజీ రాజ్యసభ సభ్యులు వీ.హన్మంతరావు పిలుపునిచ్చారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అన్న నినాదంతో ఆదివారం కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జి రాగిడి లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ రథ యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో అప్పులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టి స్వచ్ఛమైన పాలన అందించే కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాగిడి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనకు విసుగుచెందిన ప్రజలు కాంగ్రెసును అధికారంలోకి తీసుకరావడానికి ఎదురుచూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. రథయాత్రలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం.శివా రెడ్డి, పీసీసీ కార్యదర్శి జితేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు ముశ్యం శ్రీనివాస్, నేతలు ఏసూరి యాదగిరి, సుధాకర్ శెట్టి, చర్ల సుధాకర్ రెడ్డి, పీ.వెంకటేశ్, అమర్, అర్జున్, రఫిక్, మంజుల, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

పెరిగిన చలి
* ఉదయం వేళలో కమ్మేస్తున్న పొగమంచు
షాద్‌నగర్, అక్టోబర్ 21: చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేస్తున్న నేపధ్యంతో రహదారులపై వెళ్లేందుకు ప్రయాణికులు, వాహదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలితీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో వృద్ధులు, చిన్నారులు బయటకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. క్రమంగా చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న చలి కారణంగా ఉన్ని దుస్తులకు డిమాండ్ పెరుగుతుంది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20డిగ్రీల లోపే నమోదు అవుతుండటంతో చలి క్రమంగా పెరుగుతుంది. ఇదిలా ఉండగా రెండు రోజుల నుండి ఆయా మండలాల్లో చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు చలి ఉంటుండటంతో ఇళ్లల్లో నుండి వృద్ధులు, చిన్నారులు బయటకు వచ్చేందుకు ఆసక్తి ఎక్కువగా చూపించడం లేదని చెప్పవచ్చు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా గత మూడు రోజుల నుండి రాత్రి సమయంలోనే పొగమందు ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల వరకు కొనసాగుతుంది. అక్టోబర్ చివరి వారంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి అని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.