హైదరాబాద్

ప్రయాణికురాలికి బ్యాగ్ అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైల్లో ప్రయాణించిన ఓ మహిళ బ్యాగ్‌ను మరిచి దిగిపోయింది. అది గమనించిన ట్రెయిన్ గార్డు ఆ బ్యాగ్‌ను ఆ ప్రయాణీకురాలికి అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుల్బర్గా నుంచి హైదరాబాద్ వస్తున్న (ట్రెయిన్ నెంబర్ 11307) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆదివారం లక్ష్మిచట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్ వెళ్లేందుకు తాండూరులో రైలు ఎక్కింది. బంధువులతో కలిసి వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగిపోయింది. తనతో పాటు తెచ్చుకున్న హ్యండ్‌బాగ్‌ను రైలులోనే మరిచిపోయానని గమనించిన ఆ మహిళ స్థానిక రైల్వేస్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాడు. దీంతో రైల్వే స్టేషన్ మాస్టర్ వాకీటాక్‌లో సమాచారాన్ని ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ గార్డు వీ.నర్సింగ్‌రావుకు సమాచారం అందించాడు. అప్పటికే స్టేషన్ నుండి బయలుదేరిన రైలును అపాలని స్టేషన్ మాస్టర్ గార్డుకు సూచించాడు. ఈ క్రమంలో కొంత దూరం వెళ్లిన ట్రెయిన్ లింగంపల్లి హోమ్ సిగ్నల్ వద్ద ఆగింది. ఇది గమనించిన గార్డు నర్సింగ్ రావు వెంటనే ట్రెయిన్ దిగి అమె కుర్చున్న కోచ్‌లోకి ఎక్కి బ్యాగ్‌ను వెతికి స్వాధీనం చేసుకున్నాడు. ఈ బ్యాగ్‌లో రూ.45వేల రూపాయలు విలువ కలిగిన బంగారు నెక్లెస్‌తో పాటు ఐదువందల రూపాయలతో పాటు వస్తువులు బ్యాగ్‌లో ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్‌ను గార్డు నర్సింగ్‌రావు నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో లక్ష్మీ అల్లుడు జే.వినోద్ కుమార్‌కు అప్పగించాడు. ఈ సందర్భంగా గార్డు నర్సింగ్‌రావు మాట్లాడుతూ ప్రయాణికుల క్షేమమే తమ ద్యేయమని, ఓ మహిళ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగ్‌ను తిరిగి అమెకు అందజేసినందుకు ఎంతో అనందాన్ని పొందానని చెప్పారు. రైల్వే గార్డు చూపిన సమయస్పూర్తిని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే ఉన్నాతాధికారులతో పాటు తోటి గార్డులు, సిబ్బంది నర్సింగ్ రావును అభినందించారు.

సంప్రదాయ కళలను కాపాడుకోవాలి
కాచిగూడ, అక్టోబర్ 22: సంప్రదాయ కళల్ని కాపాడుకోవాలని లయన్ విజయ్ కుమార్ అన్నారు. కల్పన శ్రీ ఇండియన్ ఆర్ట్స్ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కూచిపూడి నృత్య ప్రదర్శన చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన విజయ్‌కుమార్ మాట్లాడుతూ కల్పశ్రీ సంస్థ కళాకారులను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్యంశాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైకే నాగేశ్వర రావు, సంస్థ అధ్యక్షుడు సుజేంద్ర బాబు, సీనియర్ జర్నలిస్టు రత్నాకర శర్మ పాల్గొన్నారు.