హైదరాబాద్

ప్రసూతి ఆసుపత్రిలో పసికందు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందు పురిట్లోనే మృతి చెందిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పూరిట్లోనే పసికందు కన్ను ముశాడని బాలింత బంధువులు ఆరోపించడంతో ఆసుపత్రి ఆవరణలో స్వల్ప గందరగోళం, ఉద్రిక్తతకు దారి తీసింది. బాధితుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా మాడ్గుల్ మండలం పాల్గు తాండాకు చెందిన మహేందర్ వృత్తి రీత్యా రైతు. మహేందర్ భార్య పద్మ (25) గర్భిణి కావడంతో రెండో కాన్పు నిమిత్తం ఈనెల 18వ తేదీన సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆదివారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో పద్మకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో పద్మకు తీవ్ర రక్తస్రావం జరగడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయడంతో పద్మ మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పద్మ తల్లికి తెలిపి ఏడు గంటల ప్రాంతంలో మృత శిశువును డాక్టర్లు బంధువులకు అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాలింత పద్మకు కూడా పచ్చకామెర్లు ఉన్నాయని పరిస్థితి తీవ్రంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆమె బంధువులు నిరసన తెలిపారు. అంతా బాగుందని చెప్పి ప్రసవం అనంతరం మృత శిశువును చేతిలోపెట్టి, ప్రస్తుతం బాలింతకు పరిస్థితి బాగా లేదనడం డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలింత భర్త, బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు.