హైదరాబాద్

మెట్రో రైల్‌లో మహిళా ప్రయాణికుల భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: మెట్రో రైళ్లలో మహిళల కోసం కేటాయించిన సీట్లల్లో కూర్చొనే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు భారీగా జరిమానా విధించాలని నిర్ణయించినట్టు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. సోమవారం రసుల్‌పురాలోని మెట్రోభవన్‌లో మెట్రో అధికారులు, ఎల్ అండ్ టీ అధికారులతో ఎండీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చుంటే రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించారు. మెట్రోస్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రతి మెట్రో బోగీలో పోలీస్, ఎల్ అండ్ టీ సెక్యూరిటీ సిబ్బంది నిఘా అధికం చేయాలని నిర్ణయించారు. మెట్రోలో ప్రయాణించే మహిళా ప్రయాణికులు వారికి ఎదురైన అసౌకర్యం, ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక వాట్సప్ నెంబర్‌ను త్వరలో అందుబాటులోకి తేవాలని ఎండీ అధికారులను ఆదేశించారు. మెట్రో స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పచ్చదానాన్ని మరింత పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. స్టేషన్లు, పరిసరాలను అక్రమంగా ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందు కోసం టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, పోలీస్ అధికారులతో కూడిన అధికారులతో ఎన్ ఫోర్స్‌మెంట్ టీంను ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని అధికారులు నిత్యం మెట్రో స్టేషన్లను పర్యవేక్షిస్తూ చిన్నపాటి ఆక్రమణ జరిగినా వెంటనే అందుకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే అందుబాటులోకి ఇచ్చిన రెండు కారిడార్లల పరిధిలోని అన్ని స్టేషన్లలో మిగిలి పోయిన చిన్నపాటి సివిల్ వర్క్స్‌ను వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎల్ అండ్ టీ మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీపి రెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ అధికారి అనిల్ సహాని, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనంద మోహన్ పాల్గొన్నారు.