హైదరాబాద్

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వారికే మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: రెడ్డి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వారికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘాల సమాఖ్య పేర్కొంది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమాఖ్య అధ్యక్షుడు భూపాల్ రెడ్డి మాట్లాడారు. పేరుకు అగ్ర కులమైన రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో మంది కడు దయనీయ స్థితిలో ఉన్నారని అన్నారు. కేవలం అగ్ర కులం అన్న కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా చితికి పోయి పేదరికంలో మగ్గుతున్న వారికి చేయూత నివ్వాలని పలు మార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ తన మెనిఫెస్టోలో పెడతామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, కార్పోరేషన్ ఏర్పాటు చేసి చేతులు దులుకుపోకుండా రూ. 3వేల కోట్ల నిధులు కేటాయించాలని, పేద విద్యార్ధుల కోసం గురుకుల స్థాపన, విదేశీ విద్యకు సహకారం, 50 ఏళ్లుపైబడ్డ పేదలకు పెన్షన్, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని బరోసా ఇచ్చే పార్టీలకే ఈ సారి తాము మద్దతుగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో పెండ్యాల కేశవ రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి, వంశీదర్, చల్లా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.