హైదరాబాద్

హైటెక్ సిటీ రూట్‌లో ట్రాఫికర్ ఇక బేఫికర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు ఊరట కల్గించటంతో పాటు రానున్న ముప్పై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే! ఈ స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ) కింద ఇప్పటికే పలు చోట్ల అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రాగా, కేబీఆర్ పార్కు, కంచన్‌బాగ్ ఓవైసీ ఆసుపత్రి ముందు వంటి తదితర ప్రాంతాల్లో అడ్డుంకులేర్పడిన సంగతి తెలిసిందే! అయినా పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసే అంశంపై ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చొరవ తీసుకోవటంలో మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద నిర్మించిన మరో ఫ్లైఓవర్ శుక్రవారం ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు నాలుగో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల్లో భాగంగా రూ.108.59 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కే. జోషీ, మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్‌లు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలీ, హైటెక్‌సిటీ, బయోడైవర్శిటీ పార్కు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతోంది. అంతేగాక, అటు హైటెక్‌సిటీ నుంచి గచ్చిబౌలీ వరకు, గచ్చిబౌలీ నుంచి హైటెక్‌సిటీ వరకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా తక్కువ సమయంలో ప్రయాణించే వెసులుబాటు కలుగుతోంది.

ఫ్లైఓవర్ వివరాలు
మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద రూ. 108.59 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పనులను 2016 ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభించి, ఈ నెల 2వ తేదీన పూర్తి చేశారు. మొత్తం 2600 మీటర్ల పొడువున రెండు లేన్ల బై డైరెక్షనల్ పద్ధతిలో దీన్ని నిర్మించినట్లు, సుమారు 10.50 మీటర్ల వెడల్పు రోడ్డుతో జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.108.59 కోట్లలో రూ. 48.06 కోట్లతో 4 లేన్ల బై డైరెక్షనల్ ఫ్లైఓవర్‌ను, రూ. 25.78 కోట్లతో 6 లేన్ల బై డైరెక్షనల్ అండర్‌పాస్, రూ. 28.83 కోట్లతో సర్వీసు రోడ్డు, యుటిలిటీ డక్ట్, డ్రెయిన్‌లు, రూ.5.92 కోట్లతో కనీస వసతులైన వాటర్, డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ కేబుళ్లను ఒక చోట నుంచి మరో చోటకు మార్చేందుకు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు.
దాదాపుగా 84 పీఎస్‌సీ గ్రిడర్లు, మరో 42 కాంపోజిట్ గ్రిడర్లను దీని నిర్మాణానికి వినియోగించినట్లు తెలిపారు. ఈ మార్గంలో ప్రస్తుతం గంటకు 14వేల 393 వాహానాలు రాకపోకలు సాగిస్తుండగా, 2035 నాటికి ఈ వాహనాల సంఖ్య దాదాపు 31వేల 536కు పెరగనున్నట్లు అంచనాలు వేసి, దీన్ని నిర్మించారు.

నిబంధనలు బేఖాతర్
టపాసులు కాల్చినవారిపై కేసులు
హైదరాబాద్, నవంబర్ 8: సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి టపాసులు కాల్చినవారిపై కేసులు నమోదు చేసిన్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. దీపావళి రోజు టపాసులు కాల్చేందుకు సుప్రీం కోర్టు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు నిర్ణయించిన సమయాన్ని ఉల్లఘించి టపాసులు పేల్చిన 71 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.