హైదరాబాద్

నామినేషన్ల పర్వం షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తోంది. ముఖ్యమైన నామినేషన్ల సమర్పణ పర్వం సోమవారం నుంచి మొదలైంది. తొలిరోజే నగరంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. మలక్‌పేట, ననత్‌నగర్, గోషామహల్, చార్మినార్ నియోజకవర్గాల్లో ఒక్కో నామినేషన్ దాఖలు కాగా, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి డా.కే.లక్ష్మణ్ రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. మలక్‌పేట నుంచి కేంద్ర దివంగత మాజీ మంత్రి ఆలే నరేంద్ర కుమారుడు ఆలే జితేంద్ర, సనత్‌నగర్ నుంచి మహిళా అభ్యర్థి విజయ, చార్మినార్ నుంచి టీ. ఉమామహేంద్ర, గోషామహల్ నుంచి టీ.రాజాసింగ్ నామినేషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు. తొలి రోజు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా బీజేపీకి చెందిన వారే కావటం విశేషం. జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, నామినేషన్లను ఈనెల 19వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో దాఖాలు చేయాలని సూచించారు.
విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవు
మెడికల్ బోర్డు ప్రతిపాదిస్తేనే మినహాయింపు
ఎన్నికల నిర్వాహణకు నియమితులైన సిబ్బంది విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ స్పష్టం చేశారు. ఎన్నికల కోసం ఇప్పటికే నియమితులైన ఉద్యోగులకు విధులకు హాజరయ్యేలా సంబంధిత శాఖాధిపతులు కూడా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో వారిపై కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉద్యోగులు ఆరోగ్యపరమైన కారణాలు చూపిస్తూ ఎన్నికల విధులకు మినహాయింపు కోరుతున్నారని, ప్రత్యేకంగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు, ఆ బోర్డు ప్రతిపాదిస్తేనే మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో
తొలిరోజు ఎనిమిది నామినేషన్లు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వికారాబాద్ జిల్లాలో ఇద్దరు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్ నుంచి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎం.రామోన్‌గౌడ్, కల్వకుర్తి నియోజకవర్గంలో గురక జయపాల్ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోటీచేసేందుకు సీపీఎం నుంచి టీ.కుమార్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి రాజుగౌడ్, స్వతంత్ర అభ్యర్థిగా చిలక గోపాల్ నామినేషన్లు దాఖలు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ నాయకుడు నందికొండ శ్రీనివాస్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో బరిలో దిగేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు రాజు నామినేషన్ దాఖలు చేశారు.