హైదరాబాద్

నాట్య గురువులకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అభినయ దర్పణ ఆర్ట్స్ అకాడమి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘గురు శిష్య పరంపర’ సదస్సు సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ ఆచార్య డా.్భగవతుల సేతురాం, రిటైర్డ్ హెచ్‌ఓడీ ఆర్.ప్రసన్న రాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రమాదేవి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని నాట్య గురువులను సత్కరించారు. వోలేటి రంగమణి కళారంగానికి చేసిన సేవలను కొనియాడారు.
అలరించిన నృత్య ప్రదర్శనలు
కాచిగూడ, నవంబర్ 12: బాల సచ్చిదానందం కళాపీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘బాలోత్సవం’ కార్యక్రమం సోమవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలం పూర్వ వైస్ చాన్సలర్ డా. ఆవుల మంజులత, వైఎస్‌ఆర్ మూర్తి, లయన్ విజయ్ కుమార్, శంభురి మయూరి, సంస్థ అధ్యక్షుడు రత్నాకర శర్మ పాల్గొని బాల కళాకారులను సత్కారించి అభినందించారు. బాల సచ్చిదానందం కళా పీఠం చిన్నారులు ప్రదర్శించిన శ్రాస్తీయ, జానపద, దేశభక్తి పలు అంశాలు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి.
బాల కళాకారులకు ప్రోత్సాహం
కాచిగూడ, నవంబర్ 12: బాల కళాకారులను ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని ప్రముఖ సామాజికవేత్త డా.కొత్తకృష్ణవేణి అన్నారు. స్రవంతి ఆర్ట్స్ కల్చలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘బాల కళాకారులకు నాట్య వికాస’ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొత్తకృష్ణవేణి.. బాల కళాకారులకు పురస్కారాలతో పాటు ప్రముఖ గాయకుడు తాడూరి అంజికి ‘స్వర గాంధర్వ’ బిరుదు ప్రదానం చేశారు. చిన్నతనం నుంచే పిల్లలను కళా రంగంలో ప్రొత్సహించడం సంతోషమని అన్నారు. ప్రముఖ గాయనీ సాయి పావనికి ఆత్మీయ సత్కరం చేశారు. సంస్థ అధ్యక్షురాలు, గాయకురాలు చంద్రజ్యోతి నిర్వహణలో గాయనీ, గాయకులు బాపిరాజు, బాబురావు, మహేష్, లక్ష్మీ పద్మజ, రేణుక, సుధా, జ్యోత్స్న, రాధిక అలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఆత్మరక్షణకు కరాటే
కాచిగూడ, నవంబర్ 12: విద్యతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బీజే వినయ్ స్వరూప్ అన్నారు. యమగుచ్చి తైక్వాండో అకాడమి ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడలోని వైఎంసీఏలో నిర్వహించిన బెల్ట్‌గ్రేడ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్ట్ఫికెట్స్, బెల్టులను ప్రదానం చేశారు. చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. బెల్ట్ ఎగ్జామినర్ యమగుచ్చి, గ్రాండ్ మాస్టర్ ఆర్‌కే కృష్ణ తైక్వాండో కోచ్ మాస్టర్ వి.విశ్వనాథ్ పాల్గొన్నారు.