హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ సిబ్బంది అత్యుత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల బిజీ పేరిట జీహెచ్‌ఎంసీ అధికారులు కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల విధులంటూ కొన్ని సర్కిళ్లలో సామాన్యులను ఆఫీసులోకి కూడా అనుమతించటం లేదు. నామినేషన్ల స్వీకరణ మధ్యాహ్నాం మూడు గంటలకు ముగియనున్నా, ఆ తర్వాత కూడా ఆఫీసు గేట్లు తెరవకపోవటం పట్ల వివిధ పనులపై వచ్చిన వారు విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ మున్సిపల్ ఆఫీసుకు వివిధ రకాల పనులపై వచ్చిన వారిని సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది, పోలీసులు లోనికి అనుమతించలేదు. ఆఫీసుకు వచ్చిన వారు రోడ్డు పక్కనే వాహనాలు ఆపగా, రాంగ్ పార్కింగ్‌లో నిలిపారంటూ ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీసినట్లు కొందరు సందర్శకులు వాపోతున్నారు. ఎలాగోలాగ సిబ్బందిని, పోలీసులను బతిమాలి, తాము వచ్చిన పని తాలుకూ డాక్యుమెంట్లు, కాగితాలు చూపి లోనికి వెళ్తే సిబ్బంది అందుబాటులో లేకపోవటం పట్ల నిరాశతో మళ్లీ ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఎన్నికల విధుల నిర్వాహణకు తామేమీ వ్యతిరేకం కాదని, మధ్యాహ్నాం మూడు గంటలకు నామినేషన్ల స్వీకరణ ముగిసిన తర్వాత ప్రజలను ఆఫీసులోకి అనుమతించాలని కొందరు సందర్శకులు అభిప్రాయపడ్డారు. మూడు గంటలకు నామినేషన్ల స్వీకరణ ముగిసిన తర్వాత కూడా ఖైరతాబాద్ ఆఫీసు గేట్లు మూసివేయటం ఒకరకంగా సిబ్బంది అత్యుత్సాహమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయం వరకు ఏ పనిపై వెళ్లినా, ఎలక్షన్ డ్యూటీ అంటూ సిబ్బంది రొటీన్ విధులను విస్మరిస్తున్నారని సందర్శకులు వాపోతున్నారు. ఎన్నికల విధుల కోసం కేటాయించిన సిబ్బంది తాము రోజువారీ విధులను కూడా నిర్వర్తించి, ఎన్నికల విధులను నిర్వర్తించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, ఎన్నికల విధులతో అంతంతమాత్రం సంబంధమున్న టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన సిబ్బందిని వివిధ రకాల పనులపై వెళ్లిన సందర్శకులు ఎన్ని సార్లు కలిసినా, అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. ఫలితంగా సర్కిల్, జోన్ల స్థాయిలో మంజూరు చేయాల్సిన అనేక రకాల భవన నిర్మాణ అనుమతులెన్నో ఆగిపోయాయి. ఆన్‌లైన్‌లో వచ్చే ఫైళ్లను పరిశీలించి, వారికి ఆమోదయోగ్యమైతే అప్రూవ్ చేసి, కింది స్థాయి అధికారికి పంపాల్సిన రెండు నిమిషాల విధులను నిర్వర్తించేందుకు ఎలక్షన్ డ్యూటీ అంటూ సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నామంటూ రొటీన్ డ్యూటీలను పక్కనపెట్టకుండా, రొటీన్, ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని కమిషనర్ స్పష్టం చేసినా, సర్కిళ్ల స్థాయి సిబ్బంది మాత్రం ఆ ఆదేశాలను ఏ మాత్రం అమలు చేయటం లేదన్న విమర్శలు ఉన్నాయి.