హైదరాబాద్

డబ్బు పంపిణీ అడ్డుకునేందుకు బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా 120 బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు. నగరంలో ఎన్నికల అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించేందుకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎనిమిది మంది పరిశీలకులతో ఆయన మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 15 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వీడియో సర్వేలెన్స్ టీంలు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఒక్కొక్క అకౌంటింగ్ టీం, వీడియో వ్యూయింగ్ టీంలను ప్రత్యేకంగా నియమించామని వివరించారు. దీంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ‘సి-విజిల్’ ద్వారా కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఈ బృందాలను నియమించామని వెల్లడించారు. నియమావళి అమలుకు ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక బృందాలన్నింటికీ ప్రత్యేక శిక్షణను ఇచ్చామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో గణాంకాల్లో సుక్షితులైన గ్రూప్-బి స్థాయి అధికారిని సహాయ వ్యయ పరిశీలకులుగా నియమించినట్లు తెలిపారు. వివిధ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలను సర్వైలెన్స్ బృందాలు పూర్తిగా వీడియో తీస్తాయని పేర్కొన్నారు. వివిధ బృందాలు తీసిన వీడియో సీడీలను వీడియో వ్యూయింగ్ బృందాలు పూర్తి స్థాయిలో పరిశీలించి తగు చర్యలు ప్రతిపాదిస్తాయని ఆయన వివరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అభ్యర్థుల డబ్బు పంపిణీ వంటి అంశాల ఫిర్యాదులను రౌండ్ ది క్లాక్ స్వీకరించేందుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు వీలుగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఇప్పటివరకు సీ-విజిల్ ద్వారా 79 ఫిర్యాదులు స్వీకరించామని వీటిలో 44 పరిష్కరించామని, 24 డ్రాప్ చేయగా, ఐదింటికి సమాధానాలు పంపామని, మరో ఐదు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో రూ.17.44 కోట్లను స్వాధీనం చేసుకున్నామని, రూ.11.50 లక్షల విలువైన వెండిని, రూ. 72.51లక్షల విలువైన ఇతర వస్తువులను స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ను అతిక్రమించిన 34 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఎనిమిది మంది కేంద్ర పరిశీలకులు, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్(ఎన్నికలు) జయరాజ్ కెనడీ, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు.