హైదరాబాద్

కేంద్ర పరిశీలకుల నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జరగనున్న ముందస్తు ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా జరిగేందుకు వీలుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని అంచన వేసేందుకు కేంద్రం నుంచి ఎనిమిది మంది ప్రత్యేక పరిశీలకులుగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయటంతో వారు మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమణ, ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఫిర్యాదులను ఈ కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు స్వీకరించనున్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఫిర్యాదులను ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు, సామాన్యులు నేరుగా ఫిర్యాదు కూడా చేసే వెసులుబాటు కల్పించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
ఎన్నికల నిర్వహణలో భాగం గా హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు కేటాయించిన పోలింగ్ అధికారులు, సిబ్బందికి బుధవారం తొలి విడత శిక్షణనివ్వనున్నట్లు ఎన్నికల సిబ్బంది నియామక నోడల్ అధికారి రవికిరణ్ కిషోర్ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో నిర్వహించే ఈ శిక్షణను పదివేల మంది ఉద్యోగులకు ఇవ్వటానికి వీలుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియం, వినత మహావిద్యాలయం ఆడిటోరియం, కోఠి ఉమెన్స్‌కాలేజీ, ఆర్టీసీ కల్యామండపం, హరిహరకళాభవన్, వాసవి సేవా కేంద్రం, ముకఫంజ ఇంజనీరింగ్ కాలేజీ, శాంతినగర్ వెటర్నరీ అసోసియేషన్ ఆడిటోరియంలలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సుస్థిర నగరాన్ని నిర్మించే అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలి

ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్

ఖైరతాబాద్, నవంబర్ 13: సుస్తిరమైన నగరాన్ని నిర్మించే అంశాలను అన్ని పార్టీలు తమ మెనిఫెస్టోల్లో చేర్చాలని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ డిమాండ్ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌తో కలిసి రూపొందించిన గ్రీన్ మేనిఫెస్టోను ఫోరం చైర్మన్ వేద కుమార్, విద్యావేత్త శోభా సింగ్, సామాజిక వేత్త వేణుగోపాల్ ఆవిష్కరించారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో వాతావరణంలో తీవ్రమార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. వందల ఏళ్ల క్రితమే ఎంతో ప్రణాళిక బద్దంగా నిజాం నవాబు నగరాన్ని నిర్మించగా, ప్రస్తుత పాలకులు దానిని పాడుచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో నానాటికి కాలుష్యం తీవ్ర తరం అవుతుందన్నారు. నగరం చుట్టూ ఉన్న చెరువులు, కుటుంబలు కబ్జాలకు గురికాగా, మంచినీటిని అందించిన మంజీరా, హుస్సెన్‌సాగర్, ఇతర జలషయాల్లో మురికినీరు పారుతుందని అన్నారు. చరిత్రక భవనాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. టన్నుల కొద్ది ఉత్పత్తి అవుతున్న చెత్తను రీసైక్లింగ్ చేయడం, నీటి వనరుల పరిరక్షణ, శబ్దకాలుష్య నియంత్రణ వంటి అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వర్గీస్, సంఘ మిత్రమాలి, ఆదర్శ్, చిందంబరం, సాబేర్ పాల్గొన్నారు.