హైదరాబాద్

ఐదు నామినేషన్‌లు దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం ఐదుగురు అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి చింతల రామచంద్రా రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని అన్నారు. టీడీపీ నుంచి బీఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కార్యాలయానికి చేరుకొని వేదపండితులు సూచించిన సమయానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు ఉందని, గతంలో సైతం టీడీపీ బలంతోనే బీజేపీ అభ్యర్థి చింతల విజయం సాధించారని చెప్పారు.
టీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న మనె్న గోవర్ధన్ రెడ్డి తరఫున సతీమణి కవితా రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశామని అన్నారు. ఎస్‌యూసీఐ నుంచి హేమలత, స్వతంత్ర అభ్యర్ధిగా రంజిత్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా మహాకూటమి అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌కుమార్ నామినేషన్‌ను పీఏ మధు దాఖలు చేసేందుకు రాగా పరిశీలించిన ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలు సరిగా లేనికారణంగా స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో తిరిగి గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేస్తామని మధు వెల్లడించారు.