హైదరాబాద్

18 నుంచి సత్యసాయి బాబా జన్మదినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 93వ జన్మదినోత్సవ వేడుకలను నగరంలోని శివంలో ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు ఎ.మల్లేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన బాలవికాస్ సందర్భంగా విద్యార్థులతో ‘సాయిప్రధం-ప్రేమ పదం’ నృత్య రూపకము ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ బి.రాధాకృష్ణణ్, మాజీ డీజీపీ హెచ్‌జే.దొర హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే 19న మహిళా దినోత్సవం సందర్భంగా కుమారి అభిరామి అజయ్ చే ప్రత్యేక సంగీత కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జె.ఉమాదేవి, 20న కుమారి సింధుజచే నృత్య రూపకం ఉంటుందని, ఈ కార్యక్రమానికి హైకోర్టు జడ్జి వి.రామసుబ్రహ్మణ్యం, 21న జరిగే శ్రీ సత్యసాయి సంగీత కళాశాల విద్యార్థుల సంగీత విభావరికి ముఖ్య అతిధిగా హైకోర్టు జడ్జి జస్టిస్ చల్లా కొదండరాం, 22న శ్రీ సత్యసాయి చిరకాల భక్తుల అనుభవాలతో ప్రత్యేక కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలుంటాయని, ఈ కార్యక్రమానికి హైకోర్టు జడ్జి డీవీఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ సోమయాజులు, 23న శివమ్ భజన బృందంచే సంగీత కార్యక్రమాలుంటాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నగర సంకీర్తనలు, అభిషేకం, నారాయణ సేవలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 18న ఉదయం రథోత్సవం నవంబర్ 23న మహానగర సంకీర్తనను నిర్వహించనున్నట్లు తెలిపారు. 23న మహాప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని మల్లేశ్వరరావు వెల్లడించారు.
సందడి చేసినా సోహ అలీఖాన్
ఖైరతాబాద్, నవంబర్ 14: బాలివుడ్ కథానాయక సోహ అలీఖాన్ బుధవారం నగరంలో సందడి చేశారు. మేకప్ రంగంలో శిక్షణ ఇస్తునన తమన్న మేకప్ ఇన్సిటిట్యూట్ నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మేకప్ రంగంలో ఉజ్వల భవిష్యత్ ఉందని, గతంలో ఉన్నత వర్గాలే మేకప్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, ప్రస్తుతం మధ్యతరగతి సైతం దీనికి ఇష్టపడుతుండటంతో ఈ రంగంలో శిక్షణ పొందుతున్న వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని అన్నారు. ఇటీవలే రచయితగా మారిన తాను త్వరలో నిర్మాతగా అవతారమెత్తనున్నట్టు చెప్పారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సంస్థ ఎండీ తమన్నాతో కలిసి సర్ట్ఫికెట్లు అందజేశారు.