హైదరాబాద్

త‘కరారు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో నగరంలోని 15 అసెంబ్లీ స్థానాల నుంచి ప్రజాకూటమి అభ్యర్థులుగా పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లు తారుమారవుతున్నాయి. ప్రజాకూటమిలోని కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ విడుదల చేసిన జాబితా తకరారు అవుతోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి క్షణ క్షణం అభ్యర్థుల పేర్లు, స్థానాలు, పార్టీలు మారుతుండటంతో ఆశావహుల్లో ఇప్పటి వరకున్న ఉత్కంఠ మరింత రెట్టింపయ్యింది. మహాకూటమి భాగస్వామ్య పార్టీలు మినహా ఇతర పార్టీల అభ్యర్థులు దూంధాంగా నామినేషన్లు దాఖలు చేస్తుండగా, కూటమిలోని పార్టీ ఆశావహులు టికెట్ల కోసం పాట్లు పడుతున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా, బుధవారం విడుదల చేసిన రెండో లిస్టులో పలు స్థానాల నుంచి కొత్త ముఖాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే సనత్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ సీటును మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి దాదాపు ఖరారైందని భావించినా, బుధవారం జరిగిన సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లి, గతంలో పోటీ చేసిన కూన వెంకటేశ్ గౌడ్‌కే మళ్లీ సీటు కేటాయించే అవకాశాలున్నట్లు కన్పిస్తున్నాయి. ఇక తన పరిస్థితి ఏమిటీ? అనే మర్రిశశిధర్ రెడ్డి ప్రశ్నకు తనను సికిందరాబాద్ నుంచి పోటీ చేసుకోవచ్చునని అధిష్ఠానం సమాధానమిచ్చినట్లు సమాచారం. ప్రజాకూటమిలోని భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన తెలంగాణ జన సమితి (టీజేఎస్) అంబర్‌పేట నుంచి తన అభ్యర్థిని బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 సీట్లను ఆశిస్తున్న ఈ పార్టీ నగరంలోని ఒక్క అంబర్‌పేట నుంచి మాత్రమే పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా.దాసోజు శ్రావణ్‌కుమార్, జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ తనయుడు పీ.విష్ణువర్దన్ రెడ్డి పేర్లను కూడా ఆ పార్టీ బుధవారం ఖరారు చేసింది. ప్రజాకూటమికి సంబంధించి సికిందరాబాద్, కంటోనె్మంట్, ముషీరాబాద్ నియోజకవర్గాలు ఇంకా ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తాయి? అక్కడి నుంచి పోటీ చేసే అభ్యరులెవరు అనే విషయంపై స్పష్టత రావల్సి ఉంది. కంటోనె్మంట్ కోసం కాంగ్రెస్ పట్టుబడుతుండగా, ముషీరాబాద్, సికిందరాబాద్ నియోకవర్గాలను తమకు వదిలేయాలని టీడీపీ పార్టీ కాంగ్రెస్‌కు సూచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ టికెట్ కోసం మనె్న గోవర్దన్ రెడ్డి వర్గం ఇంకా పట్టువీడటం లేదు. ఒకవైపు అనధికారికంగా మాజీ మంత్రి దానం నాగేందర్‌కు ఆ పార్టీ టికెట్ ఖరారు చేసిందని ప్రచారం జరుగుతున్నా, మరోవైపు అధిష్ఠానం తమకు తప్పకుండా టికెట్ ఖరారు చేస్తుందని మనె్న కుటుంబం, ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకటి రెండు స్థానాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌కి, కూటమిలోని అన్ని పార్టీల అభ్యర్థుల విషయంలో నామినేషన్ల స్వీకరణ చివరి నిమిషం వరకు మరెన్నో మార్పులు చోటుచేసుకునే అవకాశాల్లేకపోలేవు.