హైదరాబాద్

నేడు క్యాన్సర్‌పై అంతర్జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్(ఏఓఐ) ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో అంతర్జాతీయ క్యాన్సర్ అధ్యయన విశే్లషణ సదస్సును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం తెలియజేశారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో ఉదయం పది గంటల నుంచి ప్రారంభమయ్యే సదస్సుకు దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణులు హాజరుకానున్నట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో ఇటీవల సాధించిన అత్యాధునిక చికిత్సా విధానాలపై అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దక్షిణ ఆసియాలో క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స అందించే సంస్థగా పేరుగాంచిన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ చికిత్స విధానంలో వచ్చిన నూతన విధానాలను చర్చించే ఉద్దేశ్యంతో సదస్సును మన దేశంలో శ్రీలంకలోని మరికొన్ని నగరాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధికి అందించే అత్యాధునిక వైద్య విధానాలపై ఎన్నో పరిశోధనలు చేసి, ఫలితాలు సాధించిన మొత్తం 200 మంది వైద్య నిపుణులు పాల్గొనే ఈ సదస్సులో పిట్స్బర్గ్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయం(అమెరికా) చైర్మన్ డా.స్టాన్లీ మార్క్, అలియన్స్ క్యాన్సర్ సెంటర్ (అరిజోనా) అసిస్టెంటు ప్రొఫెసర్ డా.అజయ్ భట్నాగర్‌లు హాజరుకానున్న సదస్సుకు అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డా.ఏఎంబాబయ్య అధ్యక్షత వహించనున్నట్లు, క్యాన్సర్‌కు ఇటీవలే అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య విధానాలపై వైద్యులకు మరింత అవగాహన కలిగి, చికిత్స అందించటంలో నైపుణ్యత మరింత పెంచేందుకు సదస్సు దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.