హైదరాబాద్

‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో అగ్రస్థానమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని మహానగరాల్లో, పట్టణాల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈ సారి నగరాన్ని అగ్రస్థానంలో నిలపాలని, ఇందుకు సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సమగ్ర కార్యచరణ రూపకల్పన అంశంపై గురువారం నగరంలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ నిర్వహించనున్న స్వచ్ఛ కార్యక్రమాల్లో కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నగరవాసులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతి స్వచ్ఛ కార్యక్రమంపై కూడా స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలతో సర్వే చేయించనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ స్వీయ సర్వేలు నిర్వహించి సర్కిళ్లకు స్వచ్ఛ ర్యాంక్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2018కు నాలుగు వేల మార్కుల ప్రాతిపదికపై స్వచ్ఛ నగరాలను ఎంపిక చేయగా, 2019 స్వచ్ఛ సర్వేక్షణ్-2019కు ఐదు వేల మార్కుల ప్రాతిపదికపై స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ఆన్‌లైన్, ఎస్‌ఎంఎస్ విధానం ద్వారా పూర్తిగా డిజిటలైజ్‌డ్ సర్వే జరుగుతుందని తెలిపారు. ఈసారి ఐదువేల మార్కులను క్షేత్ర స్థాయిలో కల్పిస్తున్న స్వచ్ఛ కార్యక్రమాల పురోగతి, క్షేత్ర స్థాయిలో నేరుగా పరిశీలన, నగరవాసుల నుంచి వచ్చే స్పందన, సర్ట్ఫికేషన్‌లను అనుసరించి మార్కులు వేస్తారని వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలపై కాలనీ సంక్షేమ సంఘాలు, స్లమ్ లెవెల్ ఫెడరేషన్లు, టౌన్‌లెవెల్ ఫెడరేషన్లు, ఎన్‌సీసీ, పాఠశాల విద్యార్థుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సీనియర్ సిటిజన్, సంక్షేమ సంఘాలు, గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్స్ క్లబ్‌లను ఏర్పాటు చేసి స్వచ్ఛ కార్యక్రమాల నిర్వాహణ సామర్థ్యాను పెంపొందించనున్నట్లు తెలిపారు. సర్వేక్షణ్ 2019లో నిర్దారించిన 50 ప్రధాన కార్యక్రమాల నిర్వాహణను సమీక్ష బాధ్యతలను ప్రత్యేకంగా 30 స్వచ్ఛంద సంస్థలకు అప్పగించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల నిర్వాహణకు కాలవ్యవధిని నిర్ణయించి, వాటి అమలుకు సంబంధించి పూర్తి స్థాయి హ్యండ్‌బుక్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు పరిష్కారం తదితర 12 అంశాలకు స్వచ్ఛ భారత్ మిషన్‌చే స్టార్ రేటింగ్ ఇస్తున్నందున, ఈ అంశాలపై అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి, నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్క్‌షాప్‌లో అదనపు కమిషనర్ రవికిరణ్, హరిచందన పాల్గొన్నారు.