హైదరాబాద్

ఓటింగ్ శాతం పెంపునకు స్వచ్ఛంద సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించటంతో పాటు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. త్వరలోనే మరో 30 స్వచ్ఛంద సంస్థలను రంగంలో దింపి, వాటిచే ఓటింగ్ శాతం పెంపొందించేందుకు ప్రత్యేకంగా కృషి చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రదాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో కేవలం 53 శాతం వరకు మాత్రమే నమోదైన ఓటింగ్ శాతాన్ని వచ్చే నెల 7న జరిగే పోలింగ్‌లో మరింత పెంపొందించేందుకు అన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. 35 స్వచ్ఛంద సంస్థలు గతంలో తక్కువగా ఓటింగ్ శాతం నమోదైన ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీన ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు, వీటిల్లో అన్ని రకాల సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న మొత్తం 3856 పోలింగ్ కేంద్రాలను సూపర్‌వైజరీ అధికారులు స్వయంగా పరిశీలించి, కనీసం వసతుల కల్పన, ఇతర సౌకర్యాలపై తనిఖీలు నిర్వహిస్తారని వెల్లడించారు. అంతేగాక, ఈ నెల 17 నుంచి 19వ తేదీల్లో బూత్ స్థాయి అధికారులకు ఓటింగ్ శాతం పెంపొందించటం, ఓటర్లకు కనీస వసతుల కల్పన తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వాహణకు 23వల మంది సిబ్బంది అవసరమని, వీరిని వివిధ శాఖల నుంచి ఎంపిక చేసి, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల నిమిత్తం ఒక్కసారిగా నియామకం జరిగిన తర్వాత మెడికల్ బోర్డు ప్రతిపాదిస్తే తప్ప, ఎవరికీ మినహాయించేది లేదని, విధులకు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ఎన్నికల ప్రవర్త నియమావళి పటిష్టంగా అమలు చేస్తున్నామని, సీ-విజిల్ యాప్ ద్వారా అందిన 95 ఫిర్యాదులను పరిష్కరించినట్లు వివరించారు.