హైదరాబాద్

మెట్రో ప్రయాణికులు మూడు కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్ సమస్యతో పరేషాన్ అయ్యే మహానగరవాసులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మెట్రోరైలుకు రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. గత సంవత్సరం నవంబర్ 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మెట్రోరైలు సేవలను ఏడాది గడవకముందే సుమారు మూడు కోట్ల మంది ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన అమీర్‌పేట నుంచి మియాపూర్, అమీర్‌పేట నుంచి నాగోల్ కారిడార్ కన్నా, ఇటీవలే ప్రారంభమైన అమీర్‌పేట, ఎల్‌బీనగర్ కారిడార్‌కు ప్రయాణికుల నుంచి వేగంగా ఆదరణ పెరిగింది. మియాపూర్ నుంచి అమీర్‌పేట మీదుగా సికిందరాబాద్ స్టేషన్‌కు ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. ఈ కారిడార్ మొత్తం భారీ ట్రాఫిక్ రూటు కావటం, ఎల్‌బీనగర్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట తదితర ప్రాంతాల నుంచి సీటిలోని నాంపల్లి, ఎంజేమార్కెట్, లక్డీకాపూల్, అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి వరకు ప్రతిరోజు రాకపోకలు సాగించేవారు ఎక్కువ మంది ఉండటంతో ఇంధనం, సమయం, డబ్బును పొదుపు చేసేందుకు మెట్రోరైలు సేవలను వినియోగించుకోవటంతో ఈ కారిడార్‌లో మెట్రోరైలుకు నాగోల్- అమీర్‌పేట కారిడార్ కంటే వేగంగా స్పందన వచ్చింది. ఈ కారిడార్‌లో గౌలీగూడ సెంట్రల్ బస్ స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్లు ఉండటం కూడా ప్రయాణికుల ఆదరణ పెరిగేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ కారిడార్‌లోని మొత్తం మెట్రో స్టేషన్లలో ఇపుడిపుడే పార్కింగ్, ఇతర వౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ప్రయాణికుల సంఖ్య పెరిగిందిలా..
మెట్రో ప్రయాణికుల సంఖ్య గత మే 1వ తేదీ వరకు (మెట్రో ప్రారంభమై 154 రోజులు) కోటి మందికి చేరుకోగా, సెప్టెంబర్ 4వ తేదీ (ప్రారంభమై 180రోజులు) రెండు కోట్లకు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. 14 నవంబర్ (మెట్రో ప్రారంభమై 351రోజులకు) మూడు కోట్లకు ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అధికారులు వెల్లడించారు.
351 రోజులు.. 164198 ట్రిప్పులు
మెట్రోరైలు ప్రారంభమైన 351 రోజుల్లో మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు, అక్కడి నుంచి నాగోల్, ఎల్‌బీనగర్ వరకు మొత్తం 164198 ట్రిప్పులు మెట్రో రైలు నడించిందని అధికారులు వివరించారు. మొత్తం మూడు కోట్ల మంది ప్రయాణికులతో 200553 కిలోమీటర్ల వరకు ప్రయాణించినట్లు వెల్లడించారు. సమయ పాలన 99.7శాతం పాటించినట్లు సర్వీసుల్లో నాణ్యతను కూడా 99.9శాతం చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.