హైదరాబాద్

గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌ని ఓడించేందుకు విపక్షాలతో ఏర్పడిన ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు అయోమయం గందరగోళంగా తయారైంది. టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నా, వాటిలో మార్పులు చోటుచేసుకోవటంతో ఆశావహులకు ఆందోళన తప్పటం లేదు. నగరంలోని అన్ని స్థానాలకు ముందుగానే ఖరారు చేసిన అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్ల సమర్పణ, ప్రచారంలో అందరి కంటే ముందున్నారు. కాంగ్రెస్ ఇదివరకు ప్రకటించిన రెండు జాబితాల్లో ఒక సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు ఫిర్యాదులు రావటంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జాబితాను పునపరిశీలించగా, సనత్‌నగర్ నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు శశిధర్ రెడ్డికి నిరాశే మిగిలింది. చివరి ప్రయత్నంగా గురువారం మధ్యాహ్నం వరకు టికెట్ కోసం హస్తినాలో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో శశిధర్ రెడ్డి నగరానికి తిరిగొచ్చేశారు. సనత్‌నగర్ స్థానాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన కూన వెంకటేశ్ గౌడ్‌నే మళ్లీ బరిలో దింపేందుకు ఆ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఇక్కడి నుంచి గత 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి, పార్టీపై, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఆ పార్టీ నేతలు తలసానిని ఓడించేందుకు రంగంలో దిగారు. ఇప్పటికే పలుసార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి రెండోస్థానంతో సరిపెట్టుకున్న కూన వెంకటేశ్‌పై అన్ని వర్గాల్లో సానుభూతి ఉండటం, గెలిచిన తర్వాత తలసాని పార్టీ మారటం వంటి విషయాలు తమకు కలిసొస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కి కూడా ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజవకర్గాల్లో అసమ్మతి సెగ తగలుతోంది. అంబర్‌పేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎడ్ల సుధాకర్ రెడ్డిని కాకుండా, మాజీ కార్పొరేటర్ కాలేరు వెంకటేశ్ పేరును ఖరారు చేయటాన్ని నిరసిస్తూ గురువారం ఎడ్ల అనుచరులు అంబర్‌పేట మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఇక ఖైరతాబాద్ టికెట్‌ను ఆశించి భంగపడ్డ మనె్న గోవర్థన్ రెడ్డి ఇప్పటికే స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీకి సంబంధించి కూడా కంటోనె్మంట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్లో ఆశావహుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రెండు నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఖాతాలోకి తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. సికిందరాబాద్ టికెట్ కోసం కూడా కాంగ్రెస్ ఆశావహులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ దక్కకుండా పార్టీలో కొనసాగే విషయాన్ని కొందరు ఆశావహులు పునరాలోచిస్తామని తేల్చి చెబుతున్నారు. మొత్తానికి ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం నగరంలోని పలు సీట్ల కేటాయింపునకు సంబంధించి ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్‌కు సీనియర్ నేతలు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.