హైదరాబాద్

అత్యాధునిక విధానాలతో క్యాన్సర్‌కు చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: క్యాన్సర్ వాధి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో రెండు రేట్లు అధికమని యుపీఎంసీ క్యాన్సర్ కేంద్రం చైర్మన్, క్లీనికల్ సర్వీసెస్ డైరెక్టర్ డా.స్టాన్లీ మార్క్ అన్నారు. అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్(ఏఓఐ) ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పార్క్‌హయత్ హోటల్‌లో అంతర్జాతీయ క్యాన్సర్ అధ్యయన విశే్లషణ సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్టాన్లీ తొలుత జ్యోతిప్రజ్వలన చేసిన సదస్సును ప్రారంభించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏడు లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని వివరంచారు. ప్రతి క్యాన్సర్ చికిత్సకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుందని వివరించారు. చాలా వరకు ఒకటికంటే ఎక్కువ పద్దతులు అంటే రేడియేషన్, మెడికల్, సర్జికల్ అంకాలజీ వంటివి ఉంటాయని వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్ మరణాలతో భారతదేశంలోని మరణాలను గమనిస్తే రెండు రేటు అధికంగా మరణాలున్నాయని వివరించారు. 2020 నాటికి 17లక్షల వరకు క్యాన్సర్ కేసులు పెరగవచ్చునని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారు 2.75 లక్షల మంది క్యాన్సర్ రోగులున్నారని వివరించారు.
ఏఓఐ దక్షిణాసియాలో అందస్తున్న పశ్చిమ దేశాల తరహా అత్యంత ఆధునాతన క్యాన్సర్ సంరక్షణ, ప్రొటోకాల్స్‌లో తాజా మరిణామాలపై సమావేశంలో చర్చించారు. అమెరికాలోని పిట్స్బ్‌ర్గ్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయం, ఏఓఐల సమన్వయం ద్వారా అంకాలజీలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన నిపుణులతో భారతదేశ వైద్యులను సంప్రదించేందుకు సదస్సు ఓ చక్కని వేదిక అని వివరంచారు. అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ డా.జాగ్‌ప్రాగ్ సింగ్ గుజ్రాల్ మాట్లాడుతూ భారతదేశంలో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఏఓఐ ప్రస్తుతం 110 క్యాన్సర్ హాస్పిటల్స్ వివిధ నగరాల్లో నెలకొల్పినట్లు వివరించారు.
దక్షిణాసియాలోని అంకాలజీ కేర్ ఆసుపఅతుల్లో అత్యంత వేగవంగా వృద్ధి చెందుతున్నట్లు అభిప్రాయపడ్డారు. సదస్సుకు అలియన్స్ క్యాన్సర్ సెంటర్ (అరిజోనా) అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.అజయ్ భట్నాగర్, అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డా.ఏఎం బాబయ్య పాల్గొన్నారు.

సిటీలో ఎన్నికల ఏర్పాట్లు భేష్
హైదరాబాద్, నవంబర్ 16: అసెంబ్లీకి త్వరలో జరగనున్న ముందస్తు ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా నగంలో చేస్తున్న ఏర్పాట్లు భేష్‌గా ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎల్.వెంకటేశ్వర్లు అభినందించారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రత్నేష్‌సింగ్‌తో కలిసి నగరంలో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్‌ను అధికారికంగా కలిసి, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తర్‌ప్రదేశ్ సీఈఓ జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, నోడల్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేకంగ సమావేశమయ్యారు. నగరంలో చేపట్టిన ఓటరు జాబితా సవరణ, నమోదు, ఎన్నిలక ఏర్పాట్లు, స్వీప్ కార్యరక్రమాలు, ఓటరు చైతన్య కార్యక్రమాలు, ఎన్నికల బందోబస్తు, దాన కిషోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరు. హైదరాబాద్ జిల్లిలో ఓటరు జాబితా ప్రక్షాళన, యువ ఓటర్ల నమోదులో చేసిన కృషికి కితాబునిచ్చారు. మాక్ పోలింగ్ స్టేషన్‌ను ఉత్తర్‌ప్రదేశ్ సీఈఓ ప్రత్యేకంగా సందర్శించారు.