హైదరాబాద్

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏడీఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, నవంబర్ 16: తెలంగాణలో విద్యుత్ కాంతులకు ట్రాన్స్ ఉద్యోగులే కారణంమని, గృహ వినియోగ దారులతో పాటు రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అనేక సందర్భాల్లో ట్రాన్స్‌కో ఉద్యోగులను ముఖ్యమంత్రి ఆకాశానికి ఎత్తి వేయడంతో పాటు లక్షలో జీతాలు పెంచారు. అయినప్పటికీ సిబ్బంది, అధికారుల్లో ధనదహం తగ్గడం లేదు. సమాన్యల నుంటి సంపన్నుల వరకు వారి సేవలను తీసుకుంటే అందినంత దండుకుంటున్నారు. గత నెలలో సిటీ మీటర్ మంజురు చేయాడం కోసం ఇంటిని పరిశీలించి అంచనా వేయడం కోసం గచ్చిబౌలి సబ్‌స్టేషన్ లైన్‌మెన్ రూ.60వేలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికి పోయాడు. నెల రోజులు గడవకుండా ఏసీబీకి ఏడీఈ చిక్కడంతో ప్రాంతంలో ఆ శాఖలో ఎంత అవినీతి జరుగుతుందో ఆర్ధమవుతుంది. ట్రాన్స్ ఫారం, ఫ్యానల్ బోర్డు, ఆరు మీటర్లకు మంజురు చేయడాని రెండు లక్షల రూపాయలు లంచం డిమాడ్ చేయగా మొదటి దఫాగా లక్షరూపాయలు తీసుకుంటూ అవినీతి శాఖ అధికారులకు ట్రాన్స్‌కో ఏడీఈ చిక్కాడు. ఏసీబీ డీఎస్‌పీ సూర్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాకనాట రమేష్ కొంత కాలంగా టీఎస్ ట్రాన్స్‌కో విభాగంలో కాంట్రాక్టరుగా పని చేస్తున్నాడు. అల్లాపూర్‌కు చెందిన రవీందర్ రెడ్డి ఇంటికి కావల్సిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టు రమేష్ తీసుకున్నాడు. పనుల చేయడం కోసం ఫ్యానల్ బోర్డు, ట్రాన్స్‌ఫారం, ఆరు మీటర్ల ఏర్పాటుకు కొండాపూర్ ఏడీ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. పని అంచానాలు తయారు చేయడంతో పాటు అనుమతుల మంజురు చేయాలని ఏడీఈ శ్యామ్ మనోహర్‌ను కలసి కోరాడు. పనులను పరిశీలించి రెండున్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు బేరం కుదిరింది. మొదటి దఫాగా లక్ష రూపాలు కార్యలయంలో ఏడీకి ఇస్తుండగా ఏసీబీ అధికాలు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంతో పాటు మరో బృందం ఏడీ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్లు డీఎస్‌పీ వివరించారు. ఏడీని అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచి అనంతరం రిమాడ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు లక్ష్మి, రామలింగా రెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.

మూడు కోట్ల రూపాయలు స్వాధీనం
* కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడి
వికారాబాద్/పరిగి, నవంబర్ 16: పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లి వద్ద శుక్రవారం మూడో నెంబర్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ నిర్వహిస్తుండగా లభించిన మూడు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న వాహనంలో పీ.అరుణ్ కుమార్, కే.వెంకటేశ్వర్లు వీటిని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. జీడిమెట్ల శాఖ షాపూర్ నగర్ టీఎస్‌ఐసీసీ కాలనీ ఆదర్శ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి డ్రా చేశారని తెలిపారు. డబ్బులకు సంబంధించిన వివరాలపై ఆరా తీయగా సరైన సమాధానం రాలేదని, ఎస్పీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో పంచనామా చేసి డబ్బును సీజ్ చేశామని పేర్కొన్నారు. డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పార్థ సింహా రెడ్డి, ఏఎస్‌ఐఎల్ పర్వతా రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఖజానా కార్యాలయంలో భద్రపర్చనున్నామని తెలిపారు.