హైదరాబాద్

పెరిగిన యువ ఓటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: నగరంలో అతి తక్కువగా ఉన్న యువ ఓటర్ల సంఖ్యను పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న విధానాలు ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే ఓటర్ల తుది జాబితాను జీహెచ్‌ఎంసీ జారీ చేసే నాటికి కేవలం 0.59 శాతం ఉన్న యువ ఓటర్ల సంఖ్య ఇపుడు 1.44 శాతానికి పెరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి 74 రకాల సామాగ్రి గొడౌన్‌కు చేరుకోవటంతో గొడౌన్‌ను కమిషనర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్లలో 18-19 సంవత్సరాల వయస్సు ఓటర్లు 3.74 శాతం ఉండాల్సి ఉండగా, ఇంకా 2.30 శాతం తక్కువగా ఉన్నారని, దీనికి కారణం యువ ఓటర్లు తమ వివరాలను ఓటరుగా నమోదు చేసుకోవటంలో నిరాశతో ఉండటమేనని వివరించారు. ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పులను, తప్పుగా పొందుపర్చిన సమాచారం మొత్తాన్ని ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ, బీఎల్‌ఓలు సరి చేశారని తెలిపారు. నగరంలోని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఒకే ఇంట్లో లేదా కాంపౌండ్‌లో ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో ఒక ఇంటి నెంబరుపై 40 నుంచి 50 మంది ఓటర్లు కూడా నమోదై ఉన్న సందర్భాలున్నట్లు వివరంచారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో రూ.18.80 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, గత ఎన్నికలతో పోల్చితే అతి చాలా ఎక్కువగా అని వ్యాఖ్యానించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని 1290 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ కేంద్రాలుగా గుర్తించి, విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిస్థతి పూర్తి స్థాయిలో అదుపులో ఉందని, కేంద్ర బలగాలు కూడా త్వరలోనే నగరానికి చేరుకోనున్నట్లు వివరించారు. నగర అదనపు పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లు హరిచందన పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.