హైదరాబాద్

అసమ్మతి సెగలు.. రెబెల్స్ బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ని ఓడించేందుకు విపక్షాలతో ఏర్పాటైన ప్రజాకూటమి సీట్ల సర్దుబాట్లతో అన్ని పార్టీలకు అసమ్మతి సెగలు తగులుతున్నాయి. ఈసారి వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడి నేతలను అధినాయకులెవ్వరూ బుజ్జగించకపోవటంతో రెబెల్స్‌గా బరిలో దిగి తమ సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీలో నాంపల్లి, జూబ్లీహిల్స్ టికెట్ల కోసం ఇంకా లొల్లి కొనసాగుతోంది. నాంపల్లి టికెట్‌ను దేవర కరుణాకర్‌కు కేటాయించటం పట్ల స్థానిక ఆశావహులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్‌ను అట్లూరి రామకృష్ణ ఆశిస్తుండగా, ఆ టికెట్‌ను శ్రీ్ధర్‌రెడ్డికి కేటాయించటాన్ని నిరసిస్తూ అట్లూరి వర్గీయులు శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసనకు దిగారు. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్ ఖైరతాబాద్ టికెట్‌ను ఆశించి భంగపడిన మనె్న గోవర్థన్ రెడ్డి వర్గీయులు ఇంకా పట్టు వీడలేదు. మనె్న ఇప్పటికే స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంబర్‌పేట టికెట్‌ను మాజీ కార్పొరేటర్ కాలేరు వెంకటేశ్‌కు కేటాయించటాన్ని నిరసిస్తూ ఎడ్ల సుధాకర్‌రెడ్డి వర్గీయులు శుక్రవారం కూడా నిరసనలు చేపట్టారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన తెలంగాణ ఉద్యమకారుడు సుధాకర్ రెడ్డికే టికెట్ కేటాయించాలని వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
మోగిన రె‘బెల్స్’
ప్రజాకూటమిలోని భాగస్వామ్య పార్టీలతో సహా ఒక్క మజ్లిస్ పార్టీ మినహా అధికార పార్టీకి కూడా ఈసారి రెబెల్స్ బెడద తప్పేట్టు లేదు. కానీ, టికెట్ దక్కని బాధలో ఉన్న రెబెల్స్‌ను నామినేషన్ల స్వీకరణ ముగిసిన తర్వాత బుజ్జగించి, ఉపసంహరింపజేయాలని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు.
ఖైరతాబాద్ నుంచి ఇప్పటికే మనె్న గోవర్ధన్ రెడ్డి రెబెల్‌గా నామినేషన్ దాఖలు చేయగా, నాంపల్లి నుంచి మరో ఇద్దరు బీజేపీ నేతలు రెబెల్స్‌గా త్వరలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఖైరతాబాద్, నాంపల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన కొందరు ఆశావహులు రెబెల్స్‌గా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

సామ రంగారెడ్డికి మద్దతు
* డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ వెల్లడి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 16: మహాకూటమి తరపున బరిలో నిలిచే సామ రంగారెడ్డికి మద్దతిస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్ వెల్లడించారు. శుక్రవారం క్యామ మల్లేష్‌ను మహాకూటమి అభ్యర్థి సామ రంగారెడ్డి కలిసి తనకు మద్దతివ్వాలని కోరారు. విలేఖరులతో క్యామ మల్లేశ్ మాట్లాడుతూ మహాకూటమి తరపున బరిలో నిలిచే సామ రంగారెడ్డికి మద్దతిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర నేతలపైనే తనకోపమని, జాతీయ నేతలపై కాదని పునరుద్ఘాటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియ, జానారెడ్డి వల్లే తనకు టికెట్ దక్కలేదని వాపోయారు. రంగారెడ్డి నేరుగా వచ్చి తనను కలిసి మద్దతు కోరారని అంగీకరించినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మంఖాల దాసు పాల్గొన్నారు. మహాకూటమి తరపున బరిలో నిలిచే సామ రంగారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తాళ్ల మహేశ్‌గౌడ్, మోరుూజ్‌పాషా, కౌన్సిలర్ ఆకుల సురేష్, జక్క రాంరెడ్డి అన్నారు.