హైదరాబాద్

ఓ.. మై గౌడ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు సంబంధించి నగరంలోని 15 సీట్ల అభ్యర్థుల ఖరారు ఇపుడిపుడే కొలిక్కి వస్తోంది. సనత్‌నగర్ నియోజకవర్గం అభ్యర్థి ఖరారుపై నెలకొన్న ప్రతిష్టంభనకు శనివారం తెరపడినట్టయ్యింది. కాంగ్రెస్ జారీ చేసిన తొలి జాబితాలో అభ్యర్థిగా మర్రి శశిధర్‌రెడ్డి పేరు ఖరారైనట్టే అయి, అనూహ్యమైన మలుపుల అనంతరం కూన వెంకటేశ్‌గౌడ్ తన పంతం నెగ్గించుకున్నారు. అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు నేత కూన వెంకటేశ్ గౌడ్‌ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. గత ఎన్నికల్లో సికిందరాబాద్ స్థానం నుంచి టీ.పద్మారావుపై పోటీ చేసి రెండో స్థానంలో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత కూన వెంకటేశ్‌గౌడ్‌కు బీసీ వర్గాల్లో కొంత సానుభూతి పెరిగింది. కొంతకాలంగా సనత్‌నగర్ సీటు కోసం కూన విశ్వప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ అభ్యర్థిగా శశిధర్‌రెడ్డి పోటీ చేయనున్నట్లు చర్చ జరిగింది. కాంగ్రెస్ సీట్ల కేటాయింపులో ఈ సారి బీసీలకు అన్యాయం చేసిందంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఆయన జాబితాను పునఃపరిశీలించటం, కూనకు న్యాయం చేయాలన్న చంద్రబాబు పట్టుదలతోనే ఆయన బరిలో నిలిచారన్న వాదన సైతం ఉంది. గత ఎన్నికల్లో పరస్పర అవగాహనతో సనత్‌నగర్ నుంచి తలసాని, సికిందరాబాద్ నుంచి కూన ఒకే పార్టీ నుంచి పోటీ చేయగా, ఇపుడు వారిద్దరు ప్రత్యర్థులుగా మారారు. టికెట్ దక్కని శశిధర్‌రెడ్డి అధిష్టానం ఈ సీటు కేటాయింపుపై మరోసారి పునరాలోచించాలని, లేని పక్షంలో కూటమి సీట్ల పొత్తు ధర్మాన్ని అనుసరించి, అభ్యర్థి కూనకు మద్దతు ఇచ్చే అంశంపై కూడా కార్యకర్తలతో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కానీ ఈ టికెట్‌ను సాధించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రయత్నాలు కూడా చేసి, పార్టీ జాతీయ అధ్యక్షుడు బాబును మెప్పించిన కూన వెంకటేశ్ ఎన్నికల వ్యూహం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా సనత్‌నగర్ స్థానాన్ని కూన ప్రయత్నించగా, అప్పట్లో టీడీపీలో ఉన్న తలసాని ఇక్కడి నుంచి పోటీ చేసి కూనను సికిందరాబాద్ నుంచి పోటీ చేసేలా కూడా పార్టీ అధిష్టానాన్ని ఓప్పించగలిగారు. కానీ ఇపుడు అనూహ్యంగా వీరిద్దరు ఇక్కడ ప్రత్యర్థులుగా మారారు. ఓటరు దేవుళ్లు ఎవర్ని ఆశీర్వదిస్తారో .. మొత్తానికి గౌడ్ మాత్రం ఓ మై గా(గౌ)డ్ అనిపించారని టీడీపీ వర్గాలు అంటున్నాయ.