హైదరాబాద్

ఎపుడు ఏం జరుగుతుందో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు విపక్షాలతో ఏర్పాటైన ప్రజాకూటమి నగరంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులను దడ వెంటాడుతోంది. ప్రకటించిన అభ్యర్థుల్లో బీ ఫారం ఎవరి చేతికి అందుతుందోనన్న ఆందోళన స్పష్టంగా కన్పిస్తోంది.
ఎపుడు ఏ స్థానం ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తుందో? అభ్యర్థిగా ఎవర్నీ ప్రకటిస్తారోనన్న భయం నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల్లో ఇంకా బీ ఫారం అందని వారిలో ఈ దడ మరింత రెట్టింపవుతోంది. ముఖ్యంగా నగరంలోని నాంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి విషయంలో తలెత్తిన పొరపాటే తమ విషయంలోనూ తలెత్తుతుందా? అన్న అనుమానం కూడా వారిలో లేకపోలేదు. నాంపల్లి నియోజకవర్గం అధికార పార్టీ అభ్యర్థిగా తొలుత ఎం. ఆనంద్‌గౌడ్‌ను ప్రకటించి, ఆ తర్వాత ఆ పేరు సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్ అంటూ ఆనంద్‌గౌడ్‌కు సర్దిచెప్పిన టీఆర్‌ఎస్ అధిష్టానం సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్‌కే శనివారం బీ ఫారం అందించింది. అలాగే సనత్‌నగర్ నియోజకవర్గంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్న తర్వాత ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో నుంచి టీడీపీ తన ఖాతాలోకి తీసుకుని, శనివారం అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్‌ను ప్రకటించింది. కాంగ్రెస్ తొలి జాబితా జారీ చేసిన నాటి నుంచి ఈ స్థానం నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డికి కేటాయించినట్లు ప్రకటించి చివరకు ఆ సీటు ఆయనకు దక్కనేలేదు. దీంతో ఆయన రెబల్‌గా బరిలో దిగి తన సత్తాచాటాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే రకమైన పరిస్థితులు నాంపల్లి నియోజకవర్గంలో బీజేపీకి, టీఆర్‌ఎస్ పార్టీకి ఖైరతాబాద్‌లో టీడీపీ పార్టీకి సికిందరాబాద్‌లో ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిణామం ఇప్పటికే ఖైరతాబాద్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. కూన వెంకటేశ్‌గౌడ్‌ను సనత్‌నగర్ టీడీపీ అభ్యర్థిగా శనివారం ప్రకటించినా,ఆయనకు ఇంత వరకు బీ ఫారం ఇవ్వలేదు. ఈ రకంగా కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ల నుంచి టికెట్లు ఆశిస్తూ పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్లు దాఖలు చేసిన ఆశావహుల్లో ఎవరికి బీ ఫారం అందుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపేమో ఈ నెల 19వ తేదీ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కావటంతో అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళన మరింత రెట్టింపయ్యింది.
నామినేషన్ల తర్వాతే బుజ్జగింపులు
టీఆర్‌ఎస్ అధికార పార్టీ మొదలుకుని, ప్రజాకూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడి, స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించిన వారిని నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసే ఈ నెల 19 తర్వాతే బుజ్జగించాలని ఆయా పార్టీలు నేతలు భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఇదే రకంగా నామినేషన్ దాఖలు చేసిన మనె్న గోవర్థన్ రెడ్డి, సనత్‌నగర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ప్రకటించిన మర్రి శశిధర్‌రెడ్డితో పాటు సికిందరాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లోని వివిధ పార్టీల రెబల్స్ అభ్యర్థులను బుజ్జగించి, 22వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.