హైదరాబాద్

నిఘా నీడలో నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నామినేషన్‌ల చివరి రోజు సోమవారం కావడంతో ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈనెల 12 నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఇప్పటి వరకు సాఫీగా జరిగింది. ఈనెల 19న నామినేషన్ల పర్వం మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనుంది. దీంతో పోలీసు అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఎన్నికల బరీలో దిగిన నామినేషన్‌లు వేయని ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు చివరిరోజైన సోమవారంనాడు నామినేషన్‌లు దాఖలు చేయనున్నారు. సోమవారం మంచి రోజు ఉందని భావించిన అనేక మంది అభ్యర్థులు నామినేషన్‌లు వేయనున్న సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కార్యాలయల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు సాధారణంగా ఏర్పాటు చేసిన భద్రత కంటే అదనంగా బలగాలను మోహరించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను రెట్టింపు చేశారు.