హైదరాబాద్

శాస్ర్తియ సంగీతంలో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: శాస్ర్తియ సంగీతంలో యువత రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన రావు అన్నారు. కినె్నర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ‘యువ శాస్ర్తియ సంగీత నృత్యోత్సవాలు’ సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ రామ్మోహన రావు కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో అశ్విని గ్రూప్ అధినేత అశ్విని సుబ్బారావు, ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, ప్రముఖ గాయనీ శ్రీవల్లి శర్మ, సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు. దేవులపల్లి ప్రచ్యోదన్, స్పటిక బృందంచే గాత్ర సంగీతం, ఉజ్వల పోతరాజు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

‘పేరడీ - గారడీ’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, నవంబర్ 19: ప్రముఖ పేరడీ రచయిత తాళా భక్తుల లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘పేరడీ - గారడీ’ పుస్తకావిష్కరణ సభ ఫ్రెండ్స్ కామెడీ క్లబ్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆంద్రా బ్యాంక్ డీజీఎం రిటైర్డ్ నాగరాజా రావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షుడు ఎంవీ సుబ్రహ్మణ్యం పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కామెడీ పేరడీ పుస్తకాలను రచించడం అభినందనీయమని అన్నారు. ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ సభ్యులు సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసాద్, శివజ్యోతి, మల్లెల సుధాకర్, రవి, జెఎల్ నరసింహం ప్రదర్శించిన వేలంపాట, అభినందించాలి, ఆరోజుల్లో పాడనివ్వండి, కార్తీక సోమవారం, ఇచ్చిపుచ్చుకోవాడం, సినిమా వాతవరణం స్కీట్స్‌ను ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
కాచిగడూ, నవంబర్ 19: సచ్చిదానంద కళాపీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో‘నూతన బాల కళాకారుల సాంస్కృతిక కదంబం’ సోమవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి గాయనీ రమణ కుమారి, సాయి శాంతి సహాయ సేవా సమితి అధ్యక్షురాలు పూర్ణశాంతి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నాగమణి, సంగమేశ్వర్, ఉదయ్ కుమార్, అపర్ణ, సంస్థ అధ్యక్షుడు రత్నాకర శర్మ పాల్గొని నూతన కళాకారులను సత్కరించి అభినందించారు. చిన్నారులు ప్రదర్శించిన సంగీత, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.